Homeఆంధ్రప్రదేశ్‌Junior NTR- Chandrababu: చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ భయం.. బర్త్‌డే శుభాకాంక్షలు కూడా చెప్పరా!?

Junior NTR- Chandrababu: చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ భయం.. బర్త్‌డే శుభాకాంక్షలు కూడా చెప్పరా!?

Junior NTR- Chandrababu: నువ్వో పిల్లకాకివి.. రాజకీయాల్లో నాకంటే సీనియర్‌ ఎవరూ.. నా అనుభవం అంత లేదు.. మీ వయసు అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఒంటికాలితో లేస్తారు నారా చంద్రబాబునాయుడు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం.. అవరం తీరాక వదిలేయడంలో అపర చాణక్యుడు నారా బాబు. రాజకీయ పొత్తుల విషయం నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరినీ ఇలాగే చేస్తారు. తనకు ముప్పు అనుకుంటే ఎంతివారినైనా దూరం పెడతారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలోనూ బాబు ఇదే చతురతను ప్రదర్శిస్తున్నారు.

Junior NTR- Chandrababu
Junior NTR- Chandrababu

బర్త్‌డే విషెస్‌ కూడా చెప్పని బాబు..
సిరిరంగంలో అగ్రహీరోగా వెలుగొందుతున్నాడు నందమూరి నట వారడసుడు జూరియన్‌ ఎన్టీయార్‌. తాత, తండ్రి నుంచి నట వారసత్వాని పునికి పుచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసుల్లో ఎవరికీ లేనంత క్రేజీ.. అభినమానులను సంపాదించుకున్నారు. వారసత్వంతోపాటు శ్రమించే తత్వం ఉన్న ఎన్టీఆర్‌ను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్రీలో ఉన్న ఆయన ఇప్పటి వరకు 34 సినిమాలు తీశారు. మే 20న పుట్టిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రెండు రోజుల క్రితం 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు జూనియర్‌ పుట్టిన రోజు వేడుకను పెద్ద పండుగలానే జరుపుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అయితే బంజారా హిల్స్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి వద్ద బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి హంగామా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు వివిధ రూపాల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ మాత్రం జూనియర్‌ ఎన్టీఆర్‌కు కనీసం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపలేదు. ట్విట్టర్‌ వేదికగా మంచి చెడును షేర్‌ చేసే నారా లోకేశ కూడా జూనియర్‌ను పట్టించుకోలేదు.

Also Read: KCR- Modi: ఈ సారి కూడా ప్రధానిని సీఎం కలవడం లేదా?

కావాలనే దూరం పెడుతున్నారా?
జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయకుడు కావాలనే దూరం పెడుతున్నారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు. తన రాజకీయ భవిష్యత్‌ కోసం చంద్రబాబు నాయకుడు 2009 నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నీకల్లో దివంగత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ను ఓడించేందుకు చంద్రబాబు జూనియర్‌ను రంగంలోకి దింపారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించేందుకు ఎన్టీఆర్‌తోపాటు కుటుంబ సభ్యులను వాడుకున్నారు. 2018లోనూ నేరుగా ప్రచారం చేయించకపోయినా తన మద్దతు చంద్రబాబుకే అని మీడియా ముఖంగా చెప్పించి ఎన్టీఆర్‌ అభిమానులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓటమి తప్పలేదు. ఇటీవల అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు వాకౌట్‌ చేసి మీడియా సమావేశంలో బోరున విలపించారు. అ సమయంలో తన మేనత్తను వైసీపీ ఎమ్మెల్యేలు కించపర్చడాన్ని తట్టుకోలేకపోయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. రాజకీయాల్లోకి నేతల కుటటుంబ సభ్యులను, మహిళలను లాగడం సరికాదన్నారు. హుందాగా రాజకీయాలు చేయాలని కోరారు. కానీ చంద్రబాబు మాత్రం జూనియర్‌ను లెక్కలోకి తీసుకోవడం లేదు. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

Junior NTR- Chandrababu
Junior NTR- Chandrababu

ఏకు మేకవుతాతడనే..
నందమూరి తారకరామారావు కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కూడా తన సొంతంగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌తోపాటు ఆయన అభిమానుల ఓటుబ్యాంకు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు తర్వాత పట్టించుకోవడం లేదు. తన రాజకీయ వారసుడిగా కొడుకు నారా లోకేష్‌ను తీసుకొచ్చిన చంద్రబాబు పార్టీలో కీలక పదవి కూడా కట్టబెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు కొడుకుగా తప్ప లోకేశ్‌కు వ్యక్తిగతంగా పెద్ద ఇమేజ్‌ లేదు. ఈ సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకొస్తే తనతోపాటు తన కొడుకు ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్న బాబు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను అవసరం మేరకే వాడుకుంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే పంథా అవలంబిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు చంద్రబాబు స్వయంగా జూనియర్‌ పవర్‌ ఏమిటో చూశారు. బాబు సభలో మాట్లాడుతుండగానే ఎన్టీఆర్‌ అభిమానులు సీఎం ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు.

Also Read:Jagan Davos Tour: దావోస్ కు కుబేరులు వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ వెళ్లాడా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular