Power Cut In Pawan Kalyan Press Meet: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు కలవరపెడుతున్నాయి. ఓ పక్క నేతలు పరిస్థితి అదుపులోకి వచ్చిందని కరెంటు కోతలు ఎత్తివేస్తున్నట్లు చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 24 గంటలు విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని పదేపదే చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కరెంటు కోతలతో పనులు సజావుగా సాగడం లేదు. ఫలితంగా కరెంటు కష్టాలు తప్పడం లేదు.

తాజాగా ఏపీలో జనసేన పార్టీ సమావేశం జరుగుతుండగా కరెంటు పోయింది. జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో పవన్ కల్యాణ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పవన్ కల్యాణ్ పడిపడి నవ్వారు. ఇదీ విద్యుత్ సరఫరా పరిస్థితి అని వ్యంగ్యంగా చెప్పారు. పాలకులు ఒక పక్క కరెంటు కోతలు ఉండవని చెబుుతున్నా వాస్తవంగా జరుగుతున్నది మీరే చూస్తున్నారుగా అని సెటైర్లు వేశారు.
Also Read:KCR- Modi: ఈ సారి కూడా ప్రధానిని సీఎం కలవడం లేదా?
రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవని పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట విద్యుత్ కోతలు అమలవుతూనే ఉన్నాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలోనే కరెంటు పోవడంతో పవన్ కల్యాణ్ విస్తుపోయారు. ఇలాంటి కోతలతో జనం ఎలా వేగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ పడిపడి నవ్వుకున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ వెలుతురులోనే మాట్లాడారు.

విద్యుత్ సమస్యలతో పవర్ పోవడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. విద్యుత్ సరఫరాలో వస్తున్న ఇబ్బందులతో కుదేలైపోతున్నారు. విద్యుత్ కోతల సమస్యను ట్విటర్ లో పోస్టు చేశారు. కరెంటు కోతలు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. నిరంతరం కోతలు అమలు చేస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదు. వేసవి కాలం కావడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి పూట కోతలు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తోంది.
వైసీపీ సర్కారుపై విద్యుత్ కోతలతో విమర్శలు వస్తూనే ఉన్నాయి. కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో జనసేన ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. రోడ్లు సరిగా లేవు. అభివృద్ధి పథకాల ఊసేలేదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే సరిపోతుందా? దాంతోనే పని అయిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. విద్యుత్ కోతలకు ఇకనైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు.
Also Read:Rishabh Pant- DRS: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచిన కెప్టెన్ పంత్!
[…] Also Read: Power Cut In Pawan Kalyan Press Meet: పవర్ కట్ తో పకపక నవ్విన … […]
[…] Also Read: Power Cut In Pawan Kalyan Press Meet: పవర్ కట్ తో పకపక నవ్విన … […]
[…] Also Read: Power Cut In Pawan Kalyan Press Meet: పవర్ కట్ తో పకపక నవ్విన … […]