spot_img
Homeఅంతర్జాతీయంజో బైడెన్‌ కన్నీటి పర్యంతం.. అమెరికాలో కరోనా తీవ్రతకు నిదర్శనమిదీ

జో బైడెన్‌ కన్నీటి పర్యంతం.. అమెరికాలో కరోనా తీవ్రతకు నిదర్శనమిదీ

Joe Bident Tears

ఎన్నో ఉత్కంఠల మధ్య అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జో బైడెన్‌. జనవరి 20న ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. ఆరోగ్య సిబ్బందితో ఆయన ఓ కీలక ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన జో బైడెన్‌ కంటతడి పెట్టారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి వివరించారట.

Also Read: ప్రజలకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ కే కరోనా వ్యాక్సిన్

ఈ కాన్ఫరెన్స్‌ సందర్భంగా మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌‌ అనే నర్సు మరణానికి చేరువలో ఉన్న కోవిడ్‌ బాధితులతో తన అనుభవాలను వివరించారు. కోవిడ్‌ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని.. వారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చానని మేరీ చెప్పింది. అది విన్న బైడెన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. అందులోనూ అగ్రదేశమైన అమెరికా కూడా అన్ని దేశాలకు మించి అతలాకుతలం అయింది. లక్షలాది కేసులు నమోదవుతున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదిలో స్పందించకపోవడంతో వైరస్‌ ఉధృతి పెరిగింది. ఒకానొక సందర్భంలో మాస్కులు ధరించడం ముఖ్యమని డాక్టర్లు చెప్పిన సూచనలనూ కొట్టి పారేశారు ఆయన. తమ దేశం ‘కింగ్‌ ఆఫ్‌ వెంటిలేటర్స్‌’ అంటూ పదే పదే ప్రకటించారు.

Also Read: కరోనా భారత్‌కు ఎంత మేలు చేసిందో తెలుసా?

తాజాగా.. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా కొత్త అధ్యక్షుడు బైడెన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పీపీఈ కొరత ఉందని.. రక్షణ కోసం ప్లాస్టిక్‌ సంచులను వాడుతున్నామని తెలిపారు. ఎన్‌ 95 మాస్కులను మళ్లీమళ్లీ వాడడంతో అవి లూజ్‌ అయిపోతున్నాయని చెప్పారు. కింద పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper