spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena : జనసేన ఆషామాషి కాదు

Janasena : జనసేన ఆషామాషి కాదు

Janasena : తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక మాట చెబుతోంది. మా పార్టీ అంటే ఆషామాషీ కాదు. తెలుగు రాష్ట్రాలకు నాయకత్వం అందించింది మా పార్టీ. ఎంతోమంది నాయకులను తయారు చేసింది మా పార్టీ. తెలంగాణ సీఎం కేసీఆర్ మా వాడే. క్యాబినెట్లో సగానికి పైగా ఉన్నవారు మా వారే. ఇప్పుడు రేవంత్ సైతం మా వాడే. తెలంగాణలకు ఇద్దరు సీఎంలను అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అంటూ టిడిపి నేతలు గర్వంగా చెబుతుంటారు. కానీ ఎదుటి పార్టీల గొప్పతనాన్ని మాత్రం ఒప్పుకోరు.

ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబు కు గుర్తింపు లభించింది. ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. కెసిఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. ఈ లెక్కన తెలంగాణ, ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గురుని అందించింది కాంగ్రెస్ పార్టీయే. అలాగని వారు చెప్పుకోవడం లేదే. పార్టీలు అన్నాక నాయకులు తయారవుతారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారుతారు. దానిని మన గొప్పతనంగా చెప్పుకోవడం మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలకే చెల్లింది.

అయితే ఈ లెక్కన జనసేన కూడా ఎంతోమంది నాయకులను తయారుచేసింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన నేతే. గతంలో జనసేన తరఫున పోటీ చేశారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా యాక్టివ్ గా పని చేశారు. ఆ మధ్యన కొత్త పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వాడే. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేశారు. ఎన్నికల అనంతరం సొంత పార్టీని పెట్టుకున్నారు. ఈ మధ్యనే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఈయన సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వారే. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఇప్పుడు సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లెక్కన జనసేన కూడా అంత ఆషామాషీ కాదు. పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్నా.. అధికారంలోకి రాకున్నా ఎంతోమంది నేతలను జాతికి అందించిన ఘనత మాత్రం ఆ పార్టీకి దక్కుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper