spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan- MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంపముంచిన జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు..!

Jagan- MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంపముంచిన జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు..!

Jagan- MLC Elections
Jagan

Jagan- MLC Elections: రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్కు అన్ని విజయాలే వరిస్తూ వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి మానియా విరిగిపోతోందంటూ అధికార పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. గెలుపు ఉన్నప్పుడు కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే మాట్లాడేలా చేస్తుంది. అదే వైసీపీలో ఎన్నాళ్లు జరుగుతూ వచ్చింది. కానీ ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన ఓటమి ఇప్పుడు ఆ పార్టీలో నెగిటివ్ అంశాలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి గెలవడంతో అధికార పార్టీతో పాటు రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో సానుకూల అంశాలను అందిపుచ్చుకుని ఎదగడం సహజమే. అదే సమయంలో వ్యతిరేక అంశాల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరమో ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అంటారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు గుర్తు చేస్తున్నారు. జగన్ రాజకీయ పంత ప్రకృతికి విరుద్ధంగా సాగుతుందనే వాళ్ళు లేకపోలేదు. జగన్ సాంప్రదాయ రాజకీయానికి భిన్నంగా తనదైన ఆధునిక పోకడలతో అద్భుతాలు సృష్టిస్తున్నారని అభిప్రాయాలకు కొదవలేదు. కానీ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు అనేది వాస్తవం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన కేంద్రంగానే రాజకీయం సాగాలని, తాను తప్ప మరో నాయకుడిని ప్రధానికం తలచుకోకూడదనే జగన్ ఆలోచన, నియంతృత్వ ధోరణిగా కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది.

ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం కల్పించాలి..

రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ అంటే కార్యకర్త మొదలుకొని గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో అధినేత వరకు అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఉంటుంది. అదేంటో గాని మీ నమ్మకం జగనన్న తప్ప మరో ఏ నాయకుడు కాదని తనకు తానుగా ముఖ్యమంత్రి బలంగా చెప్పాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. అంటే తానే సర్వం, సర్వస్వం అనే భావన జగన్లో బలంగా ఉందా..? అదే నిజమైతే ఈ వ్యవహార శైలి రాచరిక పోకడలను ప్రతిబింబిస్తున్నట్టే. నవరత్నాల సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజలకు, తనకు మధ్య నేరుగా సంబంధాలు పెట్టుకునే క్రమంలో, మధ్యలో మరో నాయకుడు ఉనికి లేకపోవడం ప్రమాదకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ధోరణి సరైనది కాదనే చెప్పాలి. ఆ హెచ్చరిక, హితవు చెప్పేదే తాజా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.

అన్ని వర్గాల ప్రజల కీలకపాత్ర..

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో అన్ని వర్గాలు, కులాలు కీలకపాత్ర వహించాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, మేధావులు, బుద్ధి జీవులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని రకాల వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును, గౌరవాన్ని కోరుకుంటారు. విస్మరణను తట్టుకోలేరు. తమను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులపై అసంతృప్తితో అదును చూసుకుని దెబ్బ కొడతారు. వాటము నుంచి ఎన్ని గుణపాఠాలైనా నేర్చుకోవచ్చు. ఇదే ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు శాశ్వతం కాదు. ఓటమికి కృంగిపోయే వాళ్ళు, గెలుపునకు పొంగిపోయే వాళ్ళు రాజకీయాల్లో స్థిరంగా రానించలేరు. ఆ రెండింటిని సమపాలలో తీసుకున్న వాళ్లే విజ్ఞులు. అలాంటివారు అందరి మన్ననలు పొందుతుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఇద్దరి మధ్య అదే తేడా..

ఇక ప్రస్తుత విషయానికి వస్తే అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యకి ఉన్న ఒక ముఖ్యమైన తేడాకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. పూర్తిగా తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని పాలన సాగించినట్లయితే ఇవాళ జగన్ ఇంత మందిని శత్రువులుగా తయారు చేసుకునే వారు కాదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పట్టబద్రులు ఎమ్మెల్సీ ఫలితాలు ఓటింగ్ సరళిని గమనిస్తే జగన్ పై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వం పై వ్యతిరేకత ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు వైసిపి పెద్దలు ప్రయత్నించాలి. వైసిపి మొట్టమొదటి చేయాల్సిన పని ఆత్మ పరిశీలన. వైసిపి అధినేతగా ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పనితీరు ప్రజలకు ఒక నిశ్చితాభిప్రాయాన్ని ఏర్పరిచింది.” సీఎం జగన్ కోసం అందరూ పని చేయాలి. కానీ తనకోసం పనిచేసిన వాళ్లను కనీసం పలకరించరు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు” అనే అభిప్రాయం కొంతమందిలో నాటుకు పోయింది. వాళ్లే దానిని మరింతగా ప్రచారం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అభిప్రాయం వైసిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సానుభూతిపరుల్లో ఏర్పడడం ఆ పార్టీకి ప్రమాదకరమైన హెచ్చరికగా చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ దేవాంగత వైయస్సార్ తో జగన్ ను పోల్చుకోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. తండ్రిలాగే జగన్ ఉండాలని లేదు. కానీ తండ్రి పాలన, నడవడిక, ప్రజలతో వ్యవహరించే విధానాల్లోని మంచిని తీసుకుంటే, అది జగన్కు రాజకీయంగా ఉపయోగపడుతుందని శ్రేయోభిలాషుల అభిప్రాయం. ఉదాహరణకు జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. గ్రామ స్థాయికి పరిపాలన తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వాలంటీర్ వ్యవస్థతో తమకు రాజకీయంగా విలువ లేకుండా పోయిందనేది గ్రామస్థాయి నాయకుల ఆవేదన. ఇది చాలదన్నట్టు ఇటీవల గృహ సారథులను కొత్తగా తీసుకొచ్చారు. దీంతో నాయకుల్లో ఒక రకమైన నిరాశ, నిస్పృహలో అలుముకున్నాయి. వైసీపీని అధికారంలోకి తెచ్చుకున్న ప్రయోజనం లేదని ఆవేదన వారిలో బలంగా ఉంది. దీంతో పార్టీని వాళ్లంతా గాలికి వదిలేసారు.

వాళ్లతోనే చేయించుకుంటారన్న నిరసన..

ఏదైనా ఉంటే జగన్ నేరుగా వాలంటీర్లు, గృహ సారధులతో చేయించుకుంటారులే అనే భావన గ్రామస్థాయి నాయకుల్లో ఉంది. దీంతో పాటు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసిన నేలలో సంవత్సరాల తరబడి బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా చితికు పోతున్నారు. అలాగే సర్పంచులుగా ఎన్నికైనందుకు లక్షలాది రూపాయల ఖర్చు చేశారు. తీరా సర్పంచులకు వచ్చే నిధులను కూడా ఇతరత్రా వాటికి మళ్లించడంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ అసంతృప్తి ఆగ్రహ ఫలితం ఏ స్థాయిలో నష్టం కలిగిస్తుందో తాజా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.

గతంలో కార్యకర్తలను కలిసే రాజశేఖర్ రెడ్డి..

గతంలో వైయస్సార్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ప్రతిరోజు తెల్లవారుజామున రాష్ట్రంలోని ప్రధానికం తనను కలిసి గోడు చెప్పుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు. ఇప్పుడు జగన్ పాలనలో మచ్చుకైన అలాంటి పరిస్థితి లేదు. కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా జగన్ అపాయింట్మెంట్ లేదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. జగన్కు వ్యతిరేకులు ఎవరో స్పష్టమైనది. విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పట్టుబట్టి మరీ జగన్కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో మెజారిటీ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అయితే జగన్ తనకు అనుకూల ఓటు బ్యాంకుగా భావిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎంతవరకు అండగా నిలుస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పుడు జగన్ ఆశా నమ్మకం కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే. గతంలో వైయస్సార్ ఎంతో గొప్పగా సంక్షేమ పాలన సాగించారు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ పాలన ప్రజా రంజకంగా సాగడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే వాళ్ళు. అలాగే అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. వైయస్సార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలు.. ఒకటేమిటి అడిగిన వారికి అడగను వారికి అభివృద్ధి పనులు చేసి చూపారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. చేతినిండా డబ్బు తిరిగాడేది. మళ్లీ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇదే కారణం. ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఒకటో తేదీనే జీతాలను వారి ఖాతాల్లో వేసేవాళ్ళు. ఉద్యోగులతో వైయస్సార్ ఆత్మీయ అనుబంధం. వైయస్సార్ సర్కార్ను తమ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉద్యోగులు సొంతం చేసుకున్నారు. అందుకే చంద్రబాబును ఉద్యోగులు శత్రువులుగా భావించారు. బాబు పాలన అంటే ఉద్యోగులు భయపడే పరిస్థితి ఉండేది.

జగన్లో అది కనిపించని పరిస్థితి..

వైయస్సార్ కొడుకుగా జగన్ కూడా ఉద్యోగుల ఆ విధంగానే ఊహించారు. జగన్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. అలాంటి ఉద్యోగులను శాశ్వత శత్రువులుగా జగన్ చేసుకున్నారు. టిడిపి జనసేన మాదిరిగానే ఉద్యోగులను కూడా జగన్ ప్రత్యర్థి వర్గంగా చేసుకున్నారు. కేవలం అహంకార ద్వారంతో ఐదు లక్షల కుటుంబాలు ఉన్న ఉద్యోగులతో కయ్యానికి దిగారు. అసలు జగన్ సర్కార్ అంటేనే నిత్యం గొడవలు పెట్టుకునేదిగా ముద్ర పడింది. నా తన తండ్రి వైయస్సార్ నుంచి జగన్ వారసత్వంగా నేర్చుకున్నది అనే ప్రశ్న వెలువెత్తుతోంది. మిత్రులతో సైతం వైయస్సార్ స్నేహంగా మెలిగే వారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను సైతం కలుపుకొని పోయేలా ఆయన నడుచుకునేవారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రధానికానికి ప్రయోజనం కలిగించేలా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పుకునే పోలవరం మొదలుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సాగు తాగునీటి ప్రాజెక్టుల రూపకర్త వైయస్సార్ అంటే కాదనే వాళ్ళు ఉన్నారా..! ఎస్సార్ ఎప్పుడూ దూర దృష్టితో ఆలోచించేవారు. వైయస్సార్ పాలనలో మానవీత ఉండింది. జగన్ పాలనలో కక్ష ప్రతీకారం రాజ్యమేలుతున్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇదే తండ్రి తనయుల పాలన మధ్య తేడాగా స్పష్టంగా అర్థమవుతుంది.

Jagan- MLC Elections
Jagan- MLC Elections

నాడు అండగా నిలిచిన రాజశేఖర్ రెడ్డి..

2004లో వైయస్సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన గొప్ప పని ఏంటంటే.. తనతో పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆర్థికంగా చితకపోయిన ప్రతి ఒక్కరి పేరుతో జాబితా తయారు చేసుకుని వారందరికీ శక్తి మేరకు సాయం చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతారు. నాయకులకే కాదు రాజకీయంగా తన ఉన్నతికి దోహదం చేసిన ప్రధాని రుణం తీర్చుకోవడానికి వైఎస్సార్ జన రంజిక పాలన సాగించారు. కదా తన తండ్రి దగ్గర నుంచి జగన్ వారసత్వంగా తీసుకోవాల్సిన అంశాలు. వైయస్సార్ మహా నాయకుడు అయ్యారంటే.. చనిపోయారు కాబట్టి కాలేదు. ప్రజలకు చేసిన మంచే ఆయన్ను సజీవంగా నిలిపింది. అదే జగన్ రాజకీయ ఉన్నతికి కారణమైంది. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఆత్మహుతి దళంలా పనిచేసిన యువత ఇప్పుడేమైందో వైసిపి తెలుసుకోలేని దుస్థితి. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీని ఓడించి టిడిపిని గెలిపించింది అదే యువత. ఎన్నికల్లో ట్విస్ట్ ఏంటంటే.. సీఎం జగన్ వైసీపీ అభ్యర్థిగా చూడడం. సహజంగా ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం జగన్ ఓడించాలని అక్కతో పంతం పట్టి మరియు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్ అభిమానించే వాళ్లే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వైసిపి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాదా ఫలితాలు జగన్కు మేల్కొల్పే. తప్పులు దిద్దుకునేందుకు ఇంకా ఏడాది గడువు ఉంది. 175 కు 175 సీట్లలో గెలుస్తామని, అలాగే వై నాట్ 175 లాంటి ఓవరాక్షన్ డైలాగ్స్ చెప్పడం మాని, వాస్తవాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని పట్టబద్రులు ఓటుతో చెప్పారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బ్రమల నుంచి బయటికి..

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని, అంతా తనవైపు ఉంటారనే భ్రమలో ఊరేగితే మాత్రం మునిగిపోవడం ఖాయం. ముఖ్యంగా జనం జీవితాలను ప్రభావితం చేయని రాజధాని లాంటి అంశాలతో ప్రయోజనాలు ఉండవని జగన్ గ్రహించాలి. ఎందుకంటే గతంలో రాజధాని ఇచ్చిన చంద్రబాబుకు ఓటమి రుచి చూపించారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు కట్టిన బాబును ఓడించారు. సామాన్య ప్రధానికం ఆశలు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. సామాన్యుల నాడి జగన్ కు తెలియదని ఎవరైనా అంటే అది అబద్ధమే. సమస్యల్లా ఏంటంటే.. జగన్ ఎంతసేపు ప్రత్యర్థులపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు అధికారంలోకి వచ్చినట్లు నడుచుకుంటున్నారనే అభిప్రాయం బలపడడం.. దీంతో ఆయన చేసిన మంచి కంటే చెడే ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది. అదే ఆయన్ను దెబ్బతీస్తోంది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుంటే మరోసారి అధికారం పై ఆశలు పెట్టుకోవచ్చు. లేదంటే చంద్రబాబుకు ఏ గతి పట్టిందో కలలేదే నిలువెత్తు ప్రతిపక్ష నాయకుడు రూపంలో కనిపిస్తున్నారు. ఛాయిస్ ఏదో జగన్ తేల్చుకోవాలి. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక గా, గుణపాఠంగా అధికార పార్టీ గుర్తిస్తే మేలు.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper