AP Liquor Stores: ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ మార్కెటింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్ ద్వారానే బిల్లు కట్టడం శ్రేయస్కరం అని చెప్పుకొచ్చింది. సగటు వినియోగదారుడు కూడా డబ్బులు క్యాష్ రూపం చెల్లించడానికంటే, ఆన్లైన్ ద్వారా చెల్లించడానికే ఎక్కువ సౌకర్యంవంతంగా ఫీల్ అవుతున్నాడు.
దీంతో ఇప్పుడు చిల్లర అంగడ్ల దగ్గర నుండి చిన్న బడ్డీ కొట్టుని నడుపుకునే వాడి వరకు ప్రతీ ఒక్కరు ఫోన్ పే డిజిటల్ పేమెంట్ ద్వారా బిల్లు ని చెల్లించే సౌకర్యం ని కస్టమర్స్ కి అందుబాటులో ఉంచారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని మధ్య దూకాణాల్లో మాత్రం ఫోన్ పే పేమెంట్ లేదు. అక్కడ మొత్తం క్యాష్ రూపం లోనే ఉంటుంది..దీనికి కారణం ఏమిటో ఈపాటికే మీ అందరికీ అర్థం అయ్యుండాలి అని నిన్న జరిగిన ఏలూరు ‘వారాహి విజయ యాత్ర ‘ లో పేర్కొన్నాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి , నేడు మధ్య దుకాణాలు రన్ చేస్తూ లక్షా 25 వేల కోట్ల సంపాదించాడు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ లో కేవలం 95 వేల కోట్ల రూపాయిలు మాత్రమే పేర్కొన్నారు. మరి మిగిలిన 35 వేల కోట్ల రూపాయిలు ఏమయ్యాయి?, ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చెయ్యడం కోసమే కదా’ అంటూ నిలదీసాడు.
ఆన్లైన్ పేమెంట్ ని ఎందుకు మద్యం దుకాణాల్లో తీసేసారు, పారదర్శకత ఉంటే ఎక్కడ దొరికిపోతామో అని భయం కదా?, ఇండియా లో కొన్ని కారణాల వల్ల టిక్ టాక్ ని బ్యాన్ చేసారు, చైనా లో ఫేస్ బుక్ ని రద్దు చేసారు. కానీ మన రాష్ట్ర ముఖ్య మంత్రి జీవోలను చూపించడం రద్దు చేసాడు. ప్రభుత్వం జవాబు దారీ తనం గా ఉండాల్సిన చోట ఇలా వ్యవహరించి దేనికి సంకేతాన్ని ఇస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు.