RTD IPS AK Khan Son: నాన్న ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేశాడు. పిల్లనిచ్చిన మామ రాష్ట్ర మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యం ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి? విలువలకు నిలువుటద్దంలా కనిపించాలి. కానీ ఏం చేశాడు? ఇసుక క్వారీ ఇప్పిస్తానని ఓ వ్యక్తికి 90 లక్షలకు టెండర్ పెట్టాడు. అతడి మీద నమ్మకం లేక ఆ వ్యక్తి వద్దు పో అన్నాడు. ఎలాగూ మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు కనుక ఈసారి ఏకంగా తండ్రి దగ్గరికి, పిల్లనిచ్చిన మామ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ మాట ఈ మాట చెప్పి బురిడీ కొట్టించాడు. వాళ్లు కూడా సమాజంలో పెద్ద స్థాయి వ్యక్తులు కావడంతో ఈ మనిషీ నమ్మాడు. 90 లక్షలు ముట్ట చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఏళ్ళు గడుస్తున్నా ఇసుక క్వారీ రాలేదు. ఇచ్చిన పైసలకు వడ్డీ కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేక ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.
Also Read: Samantha: అమెరికాలో సమంత కి స్కిన్ ట్రీట్మెంట్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు సమంతకు ఏమైంది ?
..
ఏకే ఖాన్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కమిషనర్ గా పని చేశాడు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశాడు. ఒకటి, రెండు మినహా పెద్దగా అవినీతి ఆరోపణలు లేని ఆఫీసరే. ఈయన కొడుకు మోసిన్ ఖాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీ మినిస్టర్ గా పనిచేసిన షబ్బీర్ అలీ బిడ్డతో వివాహం చేశాడు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ముగిసిన తర్వాత ఏకే ఖాన్ పెద్దగా వార్తల్లో లేడు. అటు షబ్బీర్ అలీ కూడా సైలెంట్ అయ్యాడు. కానీ ఈ మోసిన్ ఖాన్ మాత్రం జల్సాలకు అలవాటుపడ్డాడు. దానికి డబ్బు కావాలి కాబట్టి ఇంట్లో అడగలేడు. అందుకే టోలిచౌకిలోని యూసఫ్ టేక్డి ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ వహాబ్ అనే వ్యక్తిని కలిశాడు. తాను ఎండీగా ఉన్న సన్ లిట్స్ మైనింగ్ కంపెనీ గురించి చెప్పాడు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం రామానుజవరం గ్రామంలో 46 ఎకరాల్లో డి కాస్టింగ్ ఆఫ్ స్యాండ్ అనుమతి తపస్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి వచ్చిందని, అందులో తనకు 25 శాతం వాటా ఉందని.. 90 లక్షలు పెట్టుబడి పెడితే ఆరున్నర కోట్ల దాకా సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. దానికి మహమ్మద్ అబ్దుల్ వహాబ్ పెద్దగా ఒప్పుకోలేదు. దీంతో ఈసారి అతడిని తన మామ అయిన షబ్బీరుద్దీన్ దగ్గరికి తీసుకెళ్లాడు. షబ్బీరుద్దీన్ కూడా మోసిన్ ఖాన్ ఏకే ఖాన్ కొడుకేనని చెప్పడంతో అబ్దుల్ మహమ్మద్ వాహాబ్ కు నమ్మకం కుదిరింది. దీంతో కొంత నగదు సన్ లిట్స్ మైనింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాడు. మిగతా నగదు మోసిన్ ఖాన్ చేతికి ఇచ్చాడు. ఈ వ్యవహారం అంతా 2016లో జరిగింది.

…
అప్పటినుంచి ఇప్పటిదాకా అబ్దుల్ వహాబ్ ఇసుక క్వారీ గురించి అడిగినప్పుడల్లా మోసిన్ ఖాన్ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో గత్యంతరం లేక వాహాబ్ పలుమార్లు ఏకే ఖాన్ ను కలిశాడు. దీంతో ఆయన డబ్బు ఇస్తా అన్నాడు. తర్వాత అడిగితే దాటవేత ధోరణిలోనే సమాధానం చెప్పాడు. షబ్బీర్ అలీ దగ్గరకు వెళ్లినా ఇదే సీన్ రిపీట్ కావడంతో.. ఇక చివరి మార్గంగా వాహాబ్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. వివరాలు సమర్పించాడు. కేసు నమోదు చేసిన కోర్టు దర్యాప్తు చేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఏ_ వన్ గా మోసిన్ ఖాన్, ఏ 2 గా రాష్ట్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏ 3 గా ఏకే ఖాన్, ఏ 4 గా సన్ లిట్స్ మైనింగ్ కంపెనీ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అయితే రామానుజవరం ప్రాంతానికి ఏమాత్రం సంబంధంలేని ఏకే ఖాన్, షబ్బీర్ అలీ, మోసిన్ ఖాన్ ఇసుక ర్యాంపులు ఇప్పిస్తామని చెప్పడం వెనక అసలు దురుద్దేశం మోసం చేయడమేనని వాహబ్ ఆరోపిస్తున్నాడు. రామానుజవరం ప్రాంతంలో నాణ్యమైన గోదావరి ఇసుక లభ్యం అవుతుంది. అయితే ఈ ప్రాంతంలో గిరిజనులు ఉండటంతో నిర్వహణ బాధ్యత వారికే దక్కుతుంది. అయితే బడా కాంట్రాక్టర్లు గిరిజనులకు ఎంతో కొంత ఇచ్చి ఇసుక క్వారీల నిర్వహణ మొత్తం వారే చూసుకుంటారు. అయితే ఇటీవల ఇటీవల అధికార పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి ఇసుక క్వారీలు ఇప్పిస్తామని పలువురి వద్ద లక్షల్లో వసూలు చేశారు. ఎంతకీ క్వారీలు దక్కకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అయితే ఏకే ఖాన్ కొడుకు ఉదంతం తర్వాత ఇప్పుడు మరోసారి ఇసుక తుట్టె కదిలింది. కాగా ప్రస్తుతం ఈ విషయంపై అటు ఏకే ఖాన్ కుటుంబం గానీ, ఇటు షబ్బీర్ అలీ కుటుంబం గానీ స్పందించడం లేదు. కానీ ఒక పోలీసు మాజీ కమిషనర్ కొడుకు 90 లక్షల కోసం ఇలా ఇసుక క్వారీ ఇప్పిస్తానని 90 లక్షలకు మోసం చేయడం పట్ల నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
Also Read: Nabha Natesh: నభా నటేష్ పరువాల విందు: ఆ అందాలు కనిపించేలా ఘాటు ఫోజులు. చూస్తే తట్టుకోలేరు . !
[…] […]