spot_img
Homeజాతీయ వార్తలుIndia Military Strength: ప్రపంచంలో ఐదో స్థానం.. భారత్‌ సైనిక శక్తి కి కొత్త ఊపు

India Military Strength: ప్రపంచంలో ఐదో స్థానం.. భారత్‌ సైనిక శక్తి కి కొత్త ఊపు

India Military Strength: మారుతున్న యుద్ధాల తీరుతో చాలా దేశాలు సైనిక శక్తిని పెంచుకుంటున్నాయి. ఆయుధాల కొనుగోళ్లు, తయారీకి భారీగా బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నాయి. భారత చుట్టూ ఉన్న దేశాలు.. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత ఆయుధ శక్తి ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో భారత్‌కు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రపంచ రక్షణ ఖర్చు జాబితాలో ఐదో స్థానాన్ని సాధించింది. ఎస్‌ఐపీఆర్‌ఐ(స్టాక్‌హోం ఇటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) తాజా నివేదిక ప్రకారం, 2025లో 92.1 బిలియన్‌ డాలర్ల వ్యయం(రూ.7.7 లక్షల కోట్లు) దీనికి నిదర్శనం. సరిహద్దు ఉద్రిక్తతలు, ఆధునిక ఆయుధాల కొనుగోళ్లు ఈ పెరుగుదలకు కారణాలు. కానీ ఇది కేవలం సంఖ్యల విజయమా? లేక దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ఒత్తిడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశాలుగా మారాయి.

ప్రాంతీయ భద్రతా సవాళ్లు..
భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల్లో మే 2025లో ఏర్పడిన ఉద్రిక్తతలు రక్షణ బడ్జెట్‌ పెరగడానికి ప్రధాన కారణం. పాకిస్తాన్‌ తన ఖర్చును 11 శాతం పెంచి 11.9 బిలియన్‌ డాలర్లకు చేర్చుకున్నప్పటికీ, భారత్‌ వ్యయం దానికి తొమ్మిది రెట్లు ఎక్కువ. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలపై పెట్టిన దృష్టి భవిష్యత్‌ యుద్ధాల స్వభావాన్ని అర్థం చేసుకున్న వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. పొరుగు దేశాల సైనిక చురుకుదలలు భారత్‌ను రక్షణాత్మకంగా మాత్రమే కాకుండా, ప్రాగ్రెసివ్‌గా మార్చాయి.

ప్రపంచ ఆయుధ పోటీ..
ప్రపంచ సైనిక వ్యయం 2.89 ట్రిలియన్‌ డాలర్లకు చేరి 11వ సంవత్సరం వృద్ధి చెందింది. అమెరికా (954 బిలియన్‌ డాలర్లు), చైనా (336 బిలియన్‌ డాలర్లు), రష్యా (190 బిలియన్‌ డాలర్లు), జర్మనీ (114 బిలియన్‌ డాలర్లు) ముందున్నాయి. భారత్‌ ఈ జాబితాలో స్థిరపడటం దేశ భౌగోలిక స్థితిని బలపరుస్తుంది. కానీ ఇది ఆయుధ పోటీలో చిక్కుకోవడం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి వ్యక్తిపై సగటు 352 డాలర్ల రక్షణ భారం, జీడీపీలో 2.5 శాతం కేటాయింపు, ఇవి 2009 తర్వాత అధిక రికార్డులు. భారత్‌ ఈ పోటీలో పాల్గొనడం అవసరమే కానీ, స్వదేశీ ఉత్పత్తి ద్వారా ఆధారపడకుండా ముందుకు సాగాలి.

సమతుల్యం కీలకం
రక్షణపై భారీ ఖర్చు భద్రతను బలపరుస్తుంది కానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సిన నిధులను తగ్గిస్తుంది. పాక్‌ 31వ స్థానంలో ఉండటం భారత్‌ ఆధిక్యాన్ని చూపిస్తుంది కానీ, ఈ పెరుగుదల స్థిరమైన అభివృద్ధికి దోహదపడాలంటే సాంకేతిక స్వయం సమృద్ధి, అకార్యకలాపాల నిర్మూలనపై దృష్టి సారించాలి. ఎస్‌ఐపీఆర్‌ఐ అంచనాల ప్రకారం 2026లో ఈ ధోరణి కొనసాగుతుంది. భద్రతను ఆర్థిక బలంగా మార్చుకోవడానికి ఇక్కడ భారత్‌కు అవకాశం ఉంది.

భారత్‌ ఈ సైనిక ఉద్ధరణను జాతీయ గర్వంగా చూసుకోవచ్చు. కానీ ప్రభుత్వం, పౌరులు కలిసి భద్రతా అవసరాలు, సంక్షేమ లక్ష్యాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. లేకపోతే, ఆయుధాల పోటీ దేశ భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper