spot_img
Homeఅంతర్జాతీయంSouth Korea : బిడ్డకు జన్మనివ్వండి.. ₹62 లక్షలు సంపాదించండి

South Korea : బిడ్డకు జన్మనివ్వండి.. ₹62 లక్షలు సంపాదించండి

South Korea : 25 ఏళ్ల దాకా చదువు.. తర్వాత కెరియర్.. ఈ లోగానే సగం జీవితం పూర్తవుతోంది. నెత్తి పైన బట్ట, ముందు పొట్ట పెరుగుతోంది. ఫలితంగా జీవితం ఒంటికాయ శొంఠి కొమ్ము అవుతోంది. యువతుల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారు కూడా చదువు, ఉద్యోగ వేటలో పడి ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే విషయాలను వాయిదా వేస్తున్నారు. ఫలితంగా ఆ పుణ్యకాలం కాస్త పూర్తవుతున్నది. అది అంతిమంగా జనాభా వృద్ధిరేటుపై పడుతోంది. జనాభా వృద్ధిరేటు తగ్గితే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని దక్షిణ కొరియా దేశం చవిచూస్తోంది. జననాల రేటు తగ్గడంతో అక్కడ జనతిరోగమనం నమోదవుతోంది. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన బూ యూంగ్ అనే నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగులకు తిరుగులేని బోనస్ ప్రకటించింది. ఒక బిడ్డకు జన్మనిస్తే 62 లక్షలు చెల్లిస్తోంది. 2021 నుంచి ఇప్పటివరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 43.65 కోట్లు చెల్లించింది. సంస్థలోని స్త్రీ, పురుష ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని.. జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ఆ సంస్థ వివరించింది.

దక్షిణ కొరియా దేశంలో కొంతకాలంగా జనాభా తిరోగమనం దిశగా సాగుతోంది. ముఖ్యంగా యువత పెళ్లిలను వాయిదా వేయటం, చదువు, ఉద్యోగాల పేరుతో వేచి చూసే ధోరణి అవలంబించడం, పిల్లల్ని కనే విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తుండడంతో జనాభా తగ్గుదల నమోదవుతోంది. దీంతో దక్షిణ కొరియా దేశంలో జనాభా పెంపుదల కోసం అక్కడి ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అయినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో నిర్మాణ రంగంలో ఉన్న బూ యూంగ్ అనే సంస్థ బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగులకు బోనస్ చెల్లిస్తోంది. ఇలా బోనస్ చెల్లించడం వల్ల ఉద్యోగులు దేశం గురించి ఆలోచిస్తారని బూ యూంగ్ చెబుతోంది.. అంతేకాదు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇది ప్రోత్సాహంగా ఉంటుందని బూ యూంగ్ వివరిస్తోంది.

బూ యూంగ్ బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు 2021 నుంచి 2024 ఫిబ్రవరి 9 వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చారు. మూడు సంవత్సరాలలో 70 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదని బూ యూంగ్ సంస్థ చెబుతోంది. తమ సంస్థ ఉద్దేశం జనాభా విస్ఫోటనం కాదని.. జనాభా తిరోగమనాన్ని నిరోధించడమేనని అంటోంది. ప్రస్తుతం బూ యూంగ్ సంస్థ చేస్తున్న ఈ పనిని దక్షిణ కొరియా వాసులు మెచ్చుకుంటున్నారు. బోనస్ ఇవ్వడం వల్ల ప్రజలు పిల్లలను కనేందుకు ఉత్సాహం చూపుతారని చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Oktelugu Epaper