Hijras Nuisance: పేరుకే హిజ్రాలు (Hijras). వారు చేసే పనులు ఎవరికి అర్థం కావు. పెళ్లిళ్లు, పేరంటాల్లో గుంపులుగా చేరి వధూవరులను ఆశీర్వదించే క్రమంలో వారు కట్నాలు డిమాండ్ చేస్తారు. వారు అడిగినంత ఇవ్వకపోతే ఇక అంతే సంగతి. వారి నుంచి తిట్ల దండకం మొదలవుతుంది. ఆ బూతులు వింటే మనకు ఏదోలా అనిపిస్తుంది. అసభ్య పదజాలంతో నానా రీతిలో బూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు. మరి వారి కట్నం ఎంతో తెలిస్తే మనకు కూడా ఆశ్చర్యం వేయక మానదు. వేలల్లో అడుగుతూ పెళ్లి వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు.
పెద్దపెద్ద నగరాల్లో హిజ్రాల హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు జరిగే ప్రాంతాలను గుర్తిస్తూ వారు గుంపులుగా సంచరిస్తుంటారు. బాయ్యా అంటూ అందరిని పలకరిస్తూ సందడి చేస్తారు. అటు ఇటు కాని వారని అందరిలో సానుభూతి ఉన్నా వారి ఆగడాలు మాత్రం మరోలా ఉంటాయి. దీంతో నగరాలైన తిరుపతి, తిరుచునారులో పెళ్లిళ్లు జరిగే కల్యాణ మండపాల్లో తరుచూ లొల్లిళ్లు జరుగుతున్నాయి. కట్నాల పేరుతో కాని పనులు చేస్తున్నారు.
పెళ్లి వేదికలపైన గ్రూపులుగా చేరి హిజ్రాలు హంగామా చేస్తున్నారు. దిష్టి పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారు. వేలకు వేలు డిమాండ్ చేస్తూ హిజ్రాలు తమ పబ్బం గడుపుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వారి తీరు వేరేలా ఉంటుంది. డబ్బులు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టడం లేదు. తిట్ట దండకంతో పెళ్లికి వచ్చిన వారిని సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
హిజ్రాల ఆగడాలపై ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీసులు సైతం వారి తీరుపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. దీంతో వారి పనులు మూడు కట్నాలు ఆరు పెళ్లిళ్లు లాగా మారిపోతున్నాయి. బాధితులు సైతం ఎందుకులే గొడవ అంటూ వారు అడిగిందంతా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో నగరాల్లోని కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలంటేనే భయం వేస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.