Homeజాతీయ వార్తలుIT Employee Working As Rapido Bike Driver: లక్షల్లో జీతం.. వీకెండ్స్ లో రాపిడో...

IT Employee Working As Rapido Bike Driver: లక్షల్లో జీతం.. వీకెండ్స్ లో రాపిడో బైక్ డ్రైవర్.. అలా అయిపోయింది ఐటీ ఉద్యోగి బతుకు

IT Employee Working As Rapido Bike Driver: ఐటి ఉద్యోగం అంటే ఎవరైనా సరే భారీ జీతం వస్తుంది అనుకుంటారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఖరీదైన ఇల్లు.. లావిష్ కారు.. వీకెండ్స్ పార్టీలతో దుమ్ము రేపు తారు అనుకుంటారు.. ఒకప్పుడు ఇలా ఉండేదేమో గాని.. ఇప్పుడు అలా లేదు. లక్షలలో జీతాలు.. ఉన్నప్పటికీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నట్టుండి ఆఫీసు […]

IT Employee Working As Rapido Bike Driver: ఐటి ఉద్యోగం అంటే ఎవరైనా సరే భారీ జీతం వస్తుంది అనుకుంటారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఖరీదైన ఇల్లు.. లావిష్ కారు.. వీకెండ్స్ పార్టీలతో దుమ్ము రేపు తారు అనుకుంటారు.. ఒకప్పుడు ఇలా ఉండేదేమో గాని.. ఇప్పుడు అలా లేదు. లక్షలలో జీతాలు.. ఉన్నప్పటికీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. రేపటి నాడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నట్టుండి ఆఫీసు నుంచి గెంటేస్తే ఏం చేయాలో కూడా తెలియదు.

ఈ పరిణామాలు ముందుగానే ఊహించిన కొంతమంది ప్రత్యామ్నాయలు చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకుంటూనే.. ఆదాయం వచ్చే పనులు చేసుకుంటున్నారు. అయితే పెరిగిన ఖర్చులు చాలామంది ఐటీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాదు ఇంటి నిర్వహణకు నగదు సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కాక చాలామంది వేరే వేరే పనులు చేసుకుంటున్నారు. మన దేశ ఐటీ క్యాపిటల్ గా పేరుపొందిన బెంగళూరులో చాలామంది ఐటీ ఉద్యోగులు వేరే పనులు చేస్తున్నారు. లక్షలలో జీతం వస్తున్నప్పటికీ ఇంటి ఖర్చులకు సరిపోక.. అప్పులు తెచ్చే మార్గం లేక.. వేరే వేరే ఉద్యోగాలు.. ఇతర పనులు చేసుకుంటున్నారు.

బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగికి నెలకు లక్షలలో వేతనం వస్తూ ఉంటుంది. అతడు ఉండేది ఓ ఖరీదైన ప్రాంతంలో.. అయితే ఇటీవల కాలంలో ధరలు పెరిగిన నేపథ్యంలో ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాక అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న ద్విచక్ర వాహనాన్ని బయటకి తీశాడు. దానిని రాపిడోలో నమోదు చేయించాడు.. ప్రతి శని, ఆదివారాల్లో అతడు రాపిడో డ్రైవర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు. ఇటీవల బెంగళూరులో అతడు ఒక రైడ్ కోసం కస్టమర్ ను ఎక్కించుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ నేపథ్యంలో తన బాధను మొత్తం ఆ ఐటి ఉద్యోగి చెప్పాడు.

“నాకంటూ ఒక కుటుంబం ఉంది. వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో కుటుంబ నిర్వహణను ఎటువంటి ఆటుపోట్లు లేకుండా చూసుకోవాలి. అది జరగాలంటే ఆదాయం సంపాదించాలి. అందువల్లే ఈ మార్గం ఎంచుకున్నాను. ప్రతి వారం లో శని, ఆదివారాల్లో ఈ పని చేస్తాను. ఇలా వచ్చిన డబ్బు కుటుంబ నిర్వహణకు సరిపోతుంది. వచ్చే వేతనం ఇతర ఖర్చులకు.. సేవింగ్స్ కు సరిపోతున్నాయని” ఆ ఐటి ఉద్యోగి చెప్పాడు. ఈ విషయాన్ని ఆ కస్టమర్ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఆర్థిక మాంద్యం రాకముందే యుద్ధం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయని.. దీనివల్ల సగటు మనిషి జీవితం ఇలా మారిపోయిందని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో రాసుకు వచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper