Haryana Shocking News: ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవి మనకు తెలిసి ఉండేవి కావు. కానీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ.. ఏ విషయం జరిగిన వెంటనే తెలిసిపోతుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాతే.. అతని అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ కొందరు ఆ వ్యక్తి పూర్తిగా మరణించాడా? లేదా? అని తెలుసుకోకుండానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఇక్కడ జరిగిన సంఘటన ఇంతకీ ఏం జరిగిందంటే?
Also Read: ఆపరేషన్ సింధూర్.. అస్సలు తగ్గే ప్రసక్తే లేదు!
హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జిల్లాకు చెందిన మజిరి అనే గ్రామంలో 75 ఏళ్ల షేర్ సింగ్ ఇటీవల తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచారు. ఆ తర్వాత రైతులు చికిత్స చేసి షేర్ సింగ్ బతికే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు షేర్ సింగును ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. రైతులు షేర్ సింగుకు వెంటిలేటర్ను అలాగే ఉంచి ఇంటికి పంపించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వెంటిలేటర్ ను తీసేశారు. అయితే షేర్ సింగ్ చనిపోయాడు అని అనుకొని అతని అంతక్రియలు ప్రారంభించారు. ఇందులో భాగంగా అతన్ని కూర్చోబెట్టి స్నానం చేపిస్తుండగా.. ఒక్కసారిగా గట్టిగా తగ్గుతూ కళ్ళు తెరిచాడు.
దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్కుకు గురయ్యారు. అయితే షేర్ సింగ్ ఒక్కసారిగా దగ్గుతూ లేచి కూర్చోవడంతో అతనిని మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసారి పరిశీలించిన వైద్యులు షేర్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడం విశేషం. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో ఇంటికి తీసుకెళ్లొచ్చు అని కూడా పేర్కొన్నారు. ఇలా అనుకోకుండా జరిగిన సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ షేర్ సింగ్ కు వైద్యులు వెంటిలేటర్ ను అమర్చి ఇంటికి పంపించినప్పుడు.. కుటుంబ సభ్యులు అతడు మరణించాడా? లేదా? అని తెలుసుకోవాల్సింది. అలా చూడకుండా అంత్యక్రియలు ప్రారంభించారని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు.. షేర్ సింగ్ బతికాడని తెలిసిన వెంటనే సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: రాజ్ భవన్ లోకి అశోకుడు!
మరోవైపు కొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం కంటే.. ఇంటి వద్ద ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంతో రికవరీ అవుతారని.. అందువల్ల ఇలాంటి వారిని స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలని చెబుతున్నారు. చాలామంది పెద్దపెద్ద వ్యాధులు వచ్చినా.. ఆస్పత్రిలోకి వెళ్లకుండా.. ఇంటి వద్ద ఉండి కొన్ని రోజులు జీవించినట్లు పేర్కొంటున్నారు. పురాతన కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేవారు.. మీరు ఎక్కువగా స్వచ్ఛమైన గాలిని పిలిచేవారు.. అందుకే ఇప్పుడు కూడా వారు స్వచ్ఛమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారని.. అందుకే ఇంటి వద్దకు రాగానే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని అసక్తిగా చర్చించుకుంటున్నారు. మరోవైపు కొందరు వైద్యులు సరైన చికిత్స చేయలేక చాలామంది ప్రాణాలు పోతున్నాయని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..