Suicide: చిన్న అబద్దమే ఆ కుటుంబం ప్రాణాలు తీసింది. పరువు పోయిందనే కారణంతో కుటుంబం మొత్తం విషం తాగి తిరిగి రాని లోకాలకు వెళ్లింది. అత్యాశే ఆ కుటుంబాన్ని కుమిలిపోయేలా చేసింది. అబద్ధమే వారి పాలి శాపమైంది. జరిగిన తతంగంపై పరువు పోయిందనే భావనతోనే వారు ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనతో విషాదం అలుముకుంది. వారి పాపను వారికి ఇచ్చేస్తే సరిపోయేదానికి అనవసరంగా నాటకం ఆడి చివరకు దొరికిపోయింది.

కర్ణాటకలోని కోలార్ పట్టణ పరిధిలోని గ్రామంలో ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని అదే ఊరికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలియకుండా సహజీవనం చేసింది. దీంతో గర్భం దాల్చింది. తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో తల్లిదండ్రులు ఇంటికి రావాలని కోరడంతో పసిపాపను పుష్ప అనే మహిళ దగ్గర ఉంచి సొంతూరుకు తల్లితో పాటు వెళ్లింది. తిరిగి అక్టోబర్ 31న వచ్చి తన పాపను తనకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ పుష్ప మాట మార్చింది. తనకు ఏ పాపను ఇవ్వలేదని తెగేసి చెప్పింది. దీంతో కంగారు పడిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు దర్యాప్తు చేసి సీసీ పుటేజీ పరిశీలించగా నిజయం బయట పడింది.
నిజం బయట పడేసరికి కుటుంబ సభ్యుల పరువు పోయిందనే కారణంతో పుష్ప కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగారు. పరిస్థితి విషమించడంతో మునియ్ప (75), నారాయణమ్మ(70), బాబు (45), గంగోత్రి(17) చనిపోయారు. పుష్ప (33) కూడా చికిత్స పొందుతూ మరణించింది. ఒకే ఒక్క అబద్ధంతో కుటుంబం మొత్తం కడతేరింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Also Read: Bumper Offer: ఇక్కడ వింత ఆచారం.. వేరొకరి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు..