spot_img
Homeఆంధ్రప్రదేశ్‌BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ఏమంత అషామాషి కాదు..

BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ఏమంత అషామాషి కాదు..

BRS In AP: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ వ్యాప్తంగా విస్తరించాలని కేసీఆర్ బయలుదేరారు. తన దయాది రాష్ట్రమైన ఏపీలో చాలా ఈజీగా విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అదంత ఈజీగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తానొక ప్రత్యామ్నాయం అవుతానని కేసీఆర్ భావించారు. ఆయన అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆయనతో కలిసి నడిచే నాయకులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది బీఆర్ఎస్ విస్తరణ అప్పుడే తేలిపోయింది. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ శరవేగంగా జరుగుతోందని.. కీలక పార్టీల నాయకులు బీఆర్ఎస్ లోకి వస్తున్నట్టు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఏపీ ఇన్ చార్జిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించడంతో ఆయన కీలక నేతలతో చర్చిస్తున్నారని కూడా టాక్ కనిపించింది. కానీ అదంతా ఉత్తమాటగా తేలిపోయింది.

BRS In AP
BRS In AP

కేసీఆర్ ఇటీవల ఏపీలో బీఆర్ఎస్ తో కలిసి నడిచే నాయకులు ఎవరా అని ఆరాతీశారు. కానీ పొలిటికల్ నాయకులు ఆయనకు తారసపడేలేదు. రాజకీయాలను,కులాలను ప్రభావితం చేసే నాయకుల వేటలో పడ్డారు. ఈ సమయంలో నలుగురు, ఐదుగురు కుల సంఘాల ప్రతినిధులు తారసపడ్డారు. దీంతో వారికి తెలంగాణలోని ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఏదో రకంగా రాజకీయం చేయాలని ఎదురుచూస్తున్నవారు ప్రగతి భవన్ కు సంతోషంగా వెళ్లి కేసీఆర్ ను కలిశారు ఏపీలో బీఆర్ఎస్ ను తాము లీడ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే వీరు ఎంతవరకు వర్కవుట్ చేస్తారని కేసీఆర్ కు తెలుసు. అయినా ఏపీలో జెండా మోసేందుకు కొందరు కావాలన్నతలంపుతో వారితో కేసీఆర్ గ్రూప్ ఫొటొ దిగి సంతృప్తి చేసి పంపించేశారు.

ఏపీలోని బీఆర్ఎస్ లో చేరుతున్న వారి జాబితాను హైకమాండ్ ప్రకటించింది. మీడియాకు లీకులిచ్చింది. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు, సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం నేత నాగేశ్వరరావు, బీసీ సంఘం నేత అంజన్ రావు బీఆర్ఎస్ లో చేరినట్టు ప్రకటించారు. అయితే ఏపీ రాజకీయాల్లో కానీ.. కుల సంఘాల యాక్టివిటీస్ లో కానీ వీరి పేరు పెద్దగా వినిపించలేదు. అయితే వీరికి పట్టుకొని ఏపీలో రాజకీయాలు చేస్తామంటే కుదరని పని. కానీ వీరు శాంపిళ్ల వరకే కానీ,.లోలోపల చాలామంది నాయకులు పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.

BRS In AP
BRS In AP

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నట్టు ప్రచారం చేశారు. అందుకు అనుగుణంగానే విజయవాడలో భారీ కటౌట్లు వెలిశాయి. పార్టీ కార్యాలయాన్ని సైతం గుర్తించారు. ఒకరిద్దరు టీడీపీ పెద్ద నాయకులు చేరనున్నట్టు టాక్ నడిచింది. రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన చాలామంది నాయకులు బీఆర్ఎస్ తో యాక్టివ్ అవుతారని ప్రచారం చేశారు. అయితే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు హాజరు కాకపోవడంతో అదంతా ట్రాష్ గా తేలిపోయింది. అంటే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ అంచనాలకు అందని దిగువస్థితిలోఉందని చెప్పొచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper