Pawan Kalyan Visited Khairatabad RTO Office: ‘వారాహి’ కోసం పవన్ కళ్యాణ్ కదిలివచ్చారు. ఈ వారాహినే కాదు.. ఈ వాహనంతోపాటు మరో 6 వాహనాలు కూడా పవన్ వెంట ప్రచారంలో పాల్గొననున్నాయి. వీటన్నింటి కోసం పవన్ కళ్యాణ్ తనే వచ్చారు. హైదరాబాద్ ఖైరాతాబాద్ ఆఫీస్ కు ఉదయం పూట వస్తే ప్రజల సందోహాన్ని తట్టుకోలేరని సాయంత్రం రమ్మన్నారు. రవాణా కమిషనర్ కోరిక మేరకు సాయంత్రం వచ్చిన పవన్ ఆ 6 వాహనాల రిజిస్ట్రేషన్ ను దగ్గరుండి చేశారు. ఫొటోలు దిగి, డిజిటల్ సైన్ చేసి వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఏపీ సర్కార్ పవన్ వాహనాలకు నిబంధనల పేరిట అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. తెలంగాణ సర్కార్ నెత్తిన పెట్టుకుంది. సపరేట్ గా పవన్ ను ఆహ్వానించి ఆ రవాణా కమిషనర్ ఎదురేగి వచ్చి మరీ పవన్ ను సాగనంపారు. ఇదే ఏపీ,తెలంగాణకు ఉన్న తేడా. పవన్ కు లభిస్తున్న గౌరవం. తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా.. ఎంతదాకా అయినా సాగడానికి రెడీ అయ్యారు. ఏపీ సీఎం జగన్ అడ్డంకులు సృష్టించినా కూడా తన వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పవన్ షాకిచ్చారు.

ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ఆయన బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఆ ఏర్పాట్లలో హైకమాండ్ ఉంది. ఇంతలో పవన్ యువభేరీ కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జనవరి 12 శ్రీకాకుళం జిల్లా రణస్థంలో తొలి యువభేరీ నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకొని నిర్వహిస్తున్న యువభేరీలో పవన్ మంచి మెసేజ్ పంపించబోతున్నారు. గత ఎన్నికల్లో లక్షలాది మంది యువత వచ్చినా.. వారు జనసేన ఓటర్లుగా నిలబడలేకపోయారు. అప్పడున్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి ఎత్తుగడలతో చాలావరకూ ఓట్లు కన్వెర్ట్ అయిపోయాయి. అందుకే ఈసారి జాగ్రత్తపడిన పవన్ ముందుగానే మేల్కొన్నారు. ఇప్పటికే వారికి పలురకాలైన సూచనలు చేశారు. ఈసారి స్ట్రయిట్ గానే యువకులు, విద్యార్థులకు చెప్పి జనసేనకు అండగా నిలవాలని పిలుపునివ్వనున్నారు.
మరోవైపు కౌలురైతు భరోసా యాత్ర దాదాపు అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఒక్క ఉత్తరాంధ్రలో తప్ప. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కౌలురైతుల కుటుంబాలకు సాయం అందించిన సంగతి తెలిసిందే, పెండింగ్ లో ఉన్న ఉత్తరాంధ్రలో కూడా సాయం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ వెల్లడి కానుంది. మరోవైపు నిలిచిపోయిన జనవాణి కార్యక్రమ నిర్వహణపై కూడా కేంద్ర కార్యాలయం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. విశాఖలో జనవాణి కార్యక్రమానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పవన్ ను అడ్డుకోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. అయితే వరుసగా ఉత్తరాంధ్రలో పవన్ గడపనున్నారు. యువభేరీ, కౌలురైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి బస్సు యాత్రకు పవన్ సిద్ధం కానున్నారు.

బస్సు యాత్రకు వారాహి సైతం సిద్ధమైంది. దీనిపై కూడా వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. వాహనం రంగు, ఎత్తు, సామర్థ్యంపై రకరకాల విష ప్రచారం చేశారు. చివరకు టైర్లపై సైతం నిబంధనలకు విరుద్ధమని కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ రవాణా క్లీన్ చీట్ ఇచ్చి వాహనం రిజిస్ట్రేషన్ చేయడంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. ఇప్పుడు తాజాగా పవన్ ప్రచార రథం కాన్వాయ్ లోకి మరో 6 వాహనాలు వచ్చి చేరాయి.రెండు స్కార్పియోలు, ఒక టయోటా వెల్ఫేయిర్, ఒక జీపు, ఒక బెంజ్, మరో చిన్న తరహా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. పవన్ స్వయంగా రావవడంతో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పవన్ తో ఫొటో దిగేందుకు ఆసక్తి కనబరిచారు. పవన్ కూడా వారితో అప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.