spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Jail Food: జైల్లో జగన్, చంద్రబాబులు ఏం తిన్నారో తెలుసా?

Chandrababu Jail Food: జైల్లో జగన్, చంద్రబాబులు ఏం తిన్నారో తెలుసా?

Chandrababu Jail Food: గతంలో సినీ రంగంలో ఆరాధన ఉండేది. తాము అభిమానించే హీరో, హీరోయిన్ గుణగణాలు, హాబీలు, తీసుకునే ఆహారం వంటి వాటిపై అభిమానులు ఆరా తీసేవారు. హార్డ్ కోర్ ఫాన్స్ అయితే కొంత అనుసరించేవారు. అయితే ఇటీవల సినీ వ్యామోహం తగ్గింది. దాని స్థానంలో రాజకీయ అభిమానం విపరీతంగా పెరిగిపోయింది. తమ నేత ఆహార అలవాట్లు, హాబీల గురించి అభిమానులకు ఇట్టే తెలిసిపోతోంది. మా హీరో ఫలానా ఆహారం తీసుకుంటారు అంటూ గుక్క పెట్టి మరి చెబుతున్న అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉండడంతో ఆయన ఆహార అలవాట్ల గురించి ఎక్కువమంది గుర్తు చేసుకుంటున్నారు. అటు జగన్ జైలుకు వెళ్లే సమయంలో సైతం ఆయన తీసుకునే ఆహారం గురించి ఎక్కువగా చర్చ నడిచింది.

చంద్రబాబు మితాహారి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూలో తన డైట్ ప్లాన్ సైతం చంద్రబాబు వెల్లడించారు. తాను బతకడానికి మాత్రమే ఆహారం తీసుకుంటానని.. తినడం కోసం బతకనని సెటైరికల్ గా చెప్పిన సందర్భాలు సైతం ఉన్నాయి. కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే పరిమిత ఆహారాన్ని చంద్రబాబు తింటారు.ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండడంతో ఆయన తీసుకునే ఆహారం ఇది అంటూ.. అభిమానులు మెనూతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సాధారణంగా చంద్రబాబు ఉదయం పూట ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఓట్ ఉప్మా, రెండు దోసెలు, కొద్దిగా చట్నీ, రెండు ఎగ్ వైట్ లు తీసుకుంటారు. టిఫిన్ కి, భోజనానికి మధ్య మాత్రం ఒక చిన్న పండును తింటారు, మధ్యాహ్నం రాగి జొన్న, సజ్జ, రెండు లేదా మూడు ఆకుకూరలు, కొద్దిగా పెరుగుతో కూడిన ఆహారాన్ని తింటారు. లంచ్ కు ఈవినింగ్ స్నాక్స్ కు మధ్య కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. సాయంత్రం సూప్, స్నాక్స్, ఎగ్ వైట్ తీసుకుంటారు. రాత్రికి గ్లాస్ పాలు, మరీ ఆకలి వేస్తే ఒక చిన్న పండు తీసుకుంటారు. రోజుకు ఆరు గంటలపాటు మాత్రమే నిద్రిస్తారు. ఇది చంద్రబాబు మెనూ అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు.. రోజు ఇంటి భోజనం వెళుతోంది.

అటు సీఎం జగన్ సైతం నిత్యం చలాకీగా కనిపిస్తారు. దానికి ఆయన తీసుకునే ఫుడ్ కారణమని అభిమానులు చెబుతుంటారు. మామిడికాయ తురిమి చేసే పులిహోర అంటే జగన్ కు చాలా ఇష్టం. పాదయాత్ర చేసే సమయంలో సైతం దీనినే ఇష్టంగా తినేవారు. ఉదయం 4:30 గంటలకు జగన్ దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం ఏడు గంటల సమయంలో జ్యూస్ తీసుకుంటారు. టిఫిన్ చేయరు. కొన్ని డ్రై ఫ్రూట్స్ డే అల్పాహారంగా భావిస్తారు. దాదాపు బ్రేక్ ఫాస్ట్ జగన్ దూరం. మధ్యాహ్నం లంచ్ లో రైస్ కంటే పుల్కాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు రాగి ముద్ద, మటన్ కీమాను లంచ్ లో తీసుకుంటారు. ఆయన భోజనములో కుండ పెరుగు తప్పనిసరి. సాయంత్రం స్నాక్స్ రూపంలో పల్లీలు, మొక్కజొన్న పొత్తులు తీసుకుంటారు. వీకెండ్ లో మాత్రం బిరియాని, చేపల పులుసు, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలా నేతల ఫుడ్ మెనూను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper