Homeజాతీయ వార్తలుNEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఎవరికివారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా నీట్ పేపర్ లీకేజీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చేపట్టే ఆందోళనలో భాగంగా చేస్తున్న నినాదాలు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం జరగాలని చేస్తున్న ఆందోళనలో ఇటువంటి నినాదాలు […]

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఎవరికివారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా నీట్ పేపర్ లీకేజీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చేపట్టే ఆందోళనలో భాగంగా చేస్తున్న నినాదాలు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం జరగాలని చేస్తున్న ఆందోళనలో ఇటువంటి నినాదాలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. పైగా దేశంలో మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి నటుడు జైశ్రీరామ్ అనను అంటూ అదే వేదిక మీద చెబుతుంటాడు. ఇటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కు సపోర్ట్ గా ఉంటారా. దీనికితోడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ముందుగా నిరసన శిబిరంలో విద్యార్థులను రెచ్చగొట్టారు. కచ్చితంగా పార్లమెంటు ముట్టడికి రావాలని పిలుపునిచ్చారు.

వచ్చిన విద్యార్థులలో నీట్ బాధితులు లేకపోవడం విశేషం. పైగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమే అక్కడ కనిపించారు. వారంతా కూడా పోలీసుల మీదికి రాళ్లు రువ్వారు. అంతేకాదు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులకు ఓపిక నశించి లాఠీ చార్జ్ చేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అక్కడ కనిపించలేదు. నిరసనకు పిలుపునిచ్చినవారు.. ఆందోళనలు చేద్దామని చెప్పినవారు అక్కడ మచ్చుకు కూడా కనిపించలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఆ ఆందోళనలో ముందు వరుసలో ఉన్నారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. వారిలో చాలామందికి గాయాలయ్యాయి.

విద్యార్థుల పోరాటాన్ని హైజాక్ చేయడానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఎంట్రీ ఇచ్చింది. అక్రమంగా ఆప్.. టిఎంసి.. మిగతా పార్టీలు కూడా స్వరం సవరించుకోవడం మొదలుపెట్టాయి. నీట్ పేపర్ లీకేజీ గురించి నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఏం చేస్తుందో మర్చిపోతోంది. ఇటీవల కాలంలో తమకు పోలీస్ పోస్టులను పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులను ప్రయోగించింది. కేరళ రాష్ట్రంలో కూడా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అక్కడి విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కి వేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలను అమ్ముకుంది. ఇప్పటికి ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇలాంటి అవకాశవాద రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాన్ని తమకోసం వాడుకోవడం నిజంగా ఈ దేశం చేసుకున్న దురదృష్టం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper