spot_img
Homeఆంధ్రప్రదేశ్‌వ్యాక్సిన్ ఓ అద్భుతంః మ‌ర‌ణాల రేటు ఎంతంటే?

వ్యాక్సిన్ ఓ అద్భుతంః మ‌ర‌ణాల రేటు ఎంతంటే?

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ కు మందు లేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ తోనే ర‌క్ష‌ణ అని ప్ర‌పంచం నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మొద‌లు.. అన్ని దేశాలూ వ్యాక్సినేష‌న్లో బిజీగా ఉన్నాయి. అయితే.. వాటి స‌మ‌ర్థ ఎంత అన్న విష‌యంలో స్ప‌ష్ట‌మైన క్లారిటీ లేద‌నే చెప్పాలి. క‌రోనాను ఎంత మేర వ్యాక్సిన్ ఎదుర్కొంటుంది? అన్న‌ప్పుడు క్లియ‌ర్ క‌ట్ గా ఆన్స‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అయితే.. తాజా అధ్య‌య‌నం మాత్రం కీల‌క‌మైన స‌మాధానం చెబుతోంది. క‌రోనా వైర‌స్ పై వ్యాక్సిన్ ప్ర‌భావం ఏంట‌న్న‌ది వెల్ల‌డిస్తోంది.

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ ప్ర‌కారం.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మ‌ర‌ణాల శాతం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయిన‌ట్టుగా వెల్ల‌డైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవ‌లం 0.4శాతం మంది మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్టు లెక్క‌గ‌ట్టిందీ అధ్య‌య‌నం. 677 కొవిడ్ రోగుల జీనోమ్ సీక్వెనింగ్ డేటాను విశ్లేషించిన ఈ అధ్య‌య‌నంలో వ్యాక్సిన్ సామ‌ర్థ్యం అద్భుతంగా ఉంద‌ని తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌స్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.. అయితే.. మ‌ర‌ణం రాకుండా వ్యాక్సిన్ అడ్డుకుంటోంద‌ని తేలింది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచంపై డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్లు బ‌లంగా దాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 112 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్ర‌భావం చూపుతోంద‌ని స‌మాచారం. గ‌తేడాది అక్టోబ‌ర్ లో భార‌త్ లో గురించిన ఈ వేరియంట్.. ఆ త‌ర్వాత ఇత‌ర దేశాల్లోనూ క‌నిపించింది. యూర‌ప్ దేశాల్లో గ‌ట్టిగానే ప్ర‌భావం చూపుతోంది. అయితే.. ఈ వేరియంట్ ను వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నాయ‌ని తాజా అధ్య‌య‌నం తేల్చింది. వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా.. సాధార‌ణ జ్వ‌రం మాదిరిగా ఇబ్బందులు ఎదుర‌వ‌డం మిన‌హా.. ప్రాణాపాయం ఉండ‌ట్లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

అందుకే.. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సినేష‌న్ పై ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు, స‌ల‌హాలు, హెచ్చ‌రిక‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాల్లో మిన‌హా.. ఎక్క‌డా స‌రైన రీతిలో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌ట్లేదు. భార‌త్ లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 20 శాతం మందికి కూడా వ్యాక్సిన్ అంద‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి, వేగంగా వ్యాక్సిన్ ఇవ్వ‌డం ద్వారానే క‌రోనాను త‌రిమికొట్ట‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Oktelugu Epaper