Homeజాతీయ వార్తలుRahul Gandhi Assam silence: అస్సాంలో కాంగ్రెస్‌కు షాక్‌ తప్పదా.. రాహుల్‌ మౌనం ఎందుకు?

Rahul Gandhi Assam silence: అస్సాంలో కాంగ్రెస్‌కు షాక్‌ తప్పదా.. రాహుల్‌ మౌనం ఎందుకు?

Rahul Gandhi Assam silence: రాహుల్‌ గాంధీ ఏటా రాజకీయ పరిణతి చెందినట్లు కనిపిస్తున్నా వ్యూహాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నారు. అందుకే కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతోంది. ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉంది. తమిళనాడు, జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో పొత్తుతో అధికారంలో ఉంది. మొన్నటి బిహార్‌ ఎన్నికల్లో రాహుల్‌ పాచిక పారలేదు సర్‌ను వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన ఓటర్‌ అధికార్‌ యాత్ర బెడిసి కొట్టింది. జేడీయూపై వ్యతిరేకత ఉన్నా.. రాహుల్‌ కారణంగానే మరోమారు అధికారంలోకి వచ్చింది. ఓటర్‌ విభజనలు కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్నాయి. బంగ్లాదేశ్‌ మూలాల ఓటర్లపై దృష్టి పెట్టిన పాదయాత్రలు హిందూ మద్దతును కోల్పోయి, పార్టీలో నేతలు బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించింది.

బిహార్‌ పాదయాత్ర విఫలం..
పూర్వాంచల్‌ ప్రాంతంలోని మూడు–నలుగు జిల్లాల్లో బంగ్లాదేశ్‌ మూలాల ఓటర్ల కోసం 16 రోజుల ’ఓటర్‌ అధికార యాత్ర’ నిర్వహించిన రాహుల్, స్థానిక సర్కారుపై వ్యతిరేక ప్రచారం చేశారు. ఇది హిందూ ఓటర్లలో వ్యతిరేకత రేకెత్తించి, కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలను కూడా ఓడింపజేసింది. 1950ల నుంచి ఉన్న చొరబాటు సమస్యలు, 1951 ఎన్‌ఆర్సీ, 1979–85 అస్సాం ఉద్యమాల నేపథ్యంలో ఈ వ్యూహం పార్టీకి రాజకీయ దెబ్బ తీసుకొచ్చింది.

అస్సాంలోనూ చొరబాటు సమస్యలు..
అస్సాంలో 1971 తర్వాత బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు ఓటర్లుగా నమోదవుతున్నారు, ఈ వర్గం కాంగ్రెస్‌పై ఆధారపడుతోంది. రాహుల్‌ ఇక్కడ యాత్ర చేయకుండా రాహుల్‌గాంధీ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆయన మాజీ ఆర్మీ చీఫ్‌ ఎంఎం.నరావణె రాసినట్లు చెబుతున్న పుస్తకంపై ఉన్న దృష్టి అస్సాంపై పెట్టడం లేదు. ముస్లిం మద్దతు కోసం పోరాడితే హిందూ ఓటర్లు దూరమవుతారనే ఆయన భావన పార్టీకి రెండు వైపులా నష్టం కలిగిస్తోంది.

అస్సాంలో నేతల మధ్య విభేదాలు..
రఖీబుల్‌ హసన్‌కు అస్సాం ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో ఉత్తర అస్సాం హిందూ నేతలకు టికెట్లు ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తి తెచ్చింది. 2024 ఉప ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌ భూపెన్‌ బోరా అభ్యర్థిత్వం కోరినా రద్దు చేయబడింది. గౌరవ్‌ గోగోయ్‌ పాకిస్తాన్‌ ప్రశ్నలు, భార్య బ్రిటిష్‌ మూలాలు ఉండడం, పాక్‌ చారిటీతో కలిసి పనిచేయడం వంటి వివాదాలు పార్టీలో కలహాలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ వివాదాలు కాంగ్రెస్‌ను బలహీనపరిచాయి.

భూపెన్‌ బోరా బీజేపీలోకి..
రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ పీసీసీ చీఫ్‌ భూపెన్‌ బోరా, రఖీబ్‌ హసన్‌ సారథ్యం తప్పుకుని కాంగ్రెస్‌ను వదిలి వెళ్లారు. సీఎం హిమంత బిశ్వశర్మతో సమావేశమై బీజేపీలో చేరారు. ఇద్దరూ దిబ్రూగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేపథ్యంతో సత్సంబంధాలు పెంచుకున్నారు. తండ్రి తరుణ్‌ గొగోయ్‌తో విభేదాలు, పార్టీ విధానాల అసంతృప్తి కారణంగా బీజేపీ బలోపేతమైంది. ఉత్తర అస్సాంలో బలమైన హిందూ నాయకుడు దక్కడం బీజేపీకి పెద్ద లాభం.

బిహార్‌లో అనవసర స్పందనలతో ఓటమి మూటగట్టుకున్న కాంగ్రెస్‌… అస్సాంలో స్పందించకుండా మరోసారి కోల్పోబోతోంది. రాహుల్‌ త్వరగా అక్కడ పరిజనీనంగా పరిస్థితులు సరిచేస్తే మాత్రమే పార్టీ బలపడే అవకాశం ఉంది. లేకపోతే ఈ డబుల్‌ ఎర్రర్‌ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular