CM KCR buy New Plane: దేశ్ కీ నేత కావాలి అనుకుంటున్న కేసీఆర్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. పదిమంది పార్టీ నేతల విరాళాలతో జాతీయ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం వినియోగించేందుకు ఒక విమానం కొనుగోలు చేశారు. దీని విలువ 100 కోట్లు. విజయదశమి నాడే పార్టీ పేరును ప్రకటించి, ఆ రోజే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. శుక్రవారం యాదగిరి నరసింహస్వామి ఆశీర్వాదం కోసం కేసీఆర్ దంపతులు ఈ యాదాద్రి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతీయ పార్టీకి సంబంధించిన పత్రాలను స్వామి కాళ్ల ముందు పెట్టనున్నారు. కిలో 16 తులాలతో స్వామివారికి పసిడి మొక్కు చెల్లించనున్నారు. శనివారం వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు. పార్టీ ప్రకటన అనంతరం కరీంనగర్లో తొలి సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో లోకమత్ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ గురువారం కలిశారు. ఇవి ఇప్పటివరకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై ఉన్న అప్డేట్స్. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు కేసిఆర్ కు ఒక విమానం కావాల్సి వచ్చింది. అందుకు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు, ఒకరు నల్గొండ, మరొకరు కరీంనగర్ జిల్లా చెందిన నేతలు ఇందుకు సంబంధించిన ఖర్చులు భరించారు. ఈ లెక్కన ఐదుగురు తలా 20 కోట్లు ఇచ్చినట్టు స్పష్టం అవుతోంది. సరే ఇదంతా పక్కన పెట్టి ఒక్కసారి 2014 కాలానికి వెనక్కి వెళ్ళిపోతే.. అప్పట్లో గోవా తీర్మానం తర్వాత బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. అప్పట్లో గౌతమ్ ఆదానికి మోడీకి మంచి సంబంధాలు ఉండటంతో విమానాన్ని ఆయనే సమకూర్చారు. అది మొదలు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు ఢిల్లీ దాకా ఆయన విమానంలోనే వెళ్లారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ కూడా హస్తినను గెలిచేందుకు బాడుగ విమానం వద్దు అనుకున్నారేమో.. సొంత విమానాన్ని కొన్నారు. ఎంతైనా బంగారు తెలంగాణ కదా! దేశ్ కా నేత అంటే ఆమాత్రం ఉండాలి. లేకపోతే ఎంతటి నామర్థ! కెసిఆర్ కోరితే ఓ మెఘా పిచ్చిరెడ్డి, కృష్ణా రెడ్డి విమానాలు సమకూర్చగలరు. ఒక కంటి సైగ చేస్తే జూపల్లి రామేశ్వరరావు 10 విమానాలను ప్రగతి భవన్ లో పెట్టగలడు. కానీ ఇప్పుడు టరమ్స్ బాగా లేవు. అన్నింటికంటే ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రగతిభవన్ లో పరిస్థితులు ఏమంత బాగోలేవు.

_ సొంత మీడియాలో బాకాలు బాజాలు
గులాబీ పత్రిక తెలంగాణే మోడల్, కెసిఆరే లీడర్ అని ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టింది. తనకు తోచినట్టు ఏదో రాసుకుంటుంది! ఇప్పుడు పత్రికలన్నీ అదే బాపతు కదా! యావత్ మహారాష్ట్ర రైతులు కేసిఆర్ ఏ అర్జెంటుగా ప్రధాన ప్రత్యేకంగా అని ఉద్యమించేందుకు రెడీ అయిపోతున్నట్టుగా కూసింది! సారీ పత్రికా పరిభాషలో చెప్పాలంటే రాసింది. అయితే ఏంటట? అలా మేము ఎప్పుడూ అన్నాం, నీకేమైనా పిచ్చా? ఏమిటి ఈ తిక్క రాతలు అంటూ ఆ మహా రైతులు, నాయకులే ఆ పత్రికల్ని కాలబెడుతున్నారు. నమస్తే తెలంగాణ స్వయంగా రాసుకున్నట్టు కెసిఆర్ ప్రతి అడుగును మరాఠాలు గమనిస్తున్నారు. అవును నిజమే.. ఆ పత్రిక కాలబెట్టిన వాళ్ల గుండెలు కూడా మండిపోతున్నాయి. ఎందుకంటే వారు మేడిగడ్డ ముంపు బాధితులు.
అది జరిగిన మరుసటి రోజు కర్ణాటకలో కొన్ని రైతు సంఘాలు ఆందోళన చేశాయి. తనకు మైలేజ్ రావాలని కేసీఆర్ కొంతమంది రైతుబంధు సమన్వయ సమితి సభ్యులను వాళ్లతో పంపారు. అక్కడ వాళ్ళు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే, రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు మాత్రం దేశ్ కా నేత కేసిఆర్ అంటూ అనినాదాలు చేశారు. అది వారి స్థాయి. ఇక సొంత డప్పు కొట్టుకోవడంలో సాక్షిని మించిపోయిన గులాబీ పత్రిక బ్యానర్ వార్తగా అచ్చేసింది. దాని నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం! ఇటీవల మహారాష్ట్రలో కొంతమంది నమోస్తుతే తెలంగాణ ప్రతులను తగలబెట్టారు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే.. తమకు తెలియకుండానే తమ ఫోటోలను మన మాస్టర్ తెలంగాణ పత్రికలో వాడారట. అదికూడా కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావాలని డిమాండ్ చేస్తున్నట్టు రాసుకొచ్చారట. అసలే మేడిగడ్డ బాధితులు.. నమస్తే తెలంగాణ రాతలు చూసి ఒళ్ళు మండింది. ఇంకేముంది ఒళ్ళు మండిపోయి ఆ పత్రిక ప్రజలను తగలబెట్టారు. పాపం ఆ పత్రిక జర్నలిస్టులు స్వామి భక్తి కోసం సారీ కేసీఆర్ భక్తి కోసం డప్పు కొట్టబోతే అది కాస్త భుమారాంగ్ అయింది. సరే తమ నాయకుడిని ప్రధాని పీఠం ఎక్కించాలని బృహత్ వార్త యజ్ఞంలో చిన్న చిన్న లోపాలు సహజం.
_ చక్రాలు తిప్పేస్థాయి ఉందా
అదిరిందయ్యా చంద్రం కొత్త కారు, కొత్త ఇల్లు.. అప్పట్లో ఒక పెయింట్ కంపెనీకి సంబంధించిన యాడ్ ఇలా ఉండేది. ఇప్పుడు కెసిఆర్ జాతీయ పార్టీ విషయంలో కూడా ఇలాగే అనుకోవాలేమో! అప్పట్లో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తీరిగినట్టు.. తాను కూడా సొంత విమానంలో తిరగాలి అని కెసిఆర్ అనుకుంటున్నారు. కానీ ఆయన వెంట వచ్చే వారెవరు అనేదే ప్రశ్నగా ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టెంట్ సర్దుకున్నాడు. అన్నితిష్ కుమార్ థర్డ్ ఫ్రంట్ మాటే అనేదే లేదు అంటున్నాడు. తేజస్వి యాదవ్ కాంగ్రెస్తోనే మా పయనం అని తేల్చి చెప్తున్నాడు. మమతా బెనర్జీ కుంభకోణంలో కూరుకుపోయి ఉంది. మజ్లీస్ సొంతంగా ఎదగాలని తాపత్రయపడుతోంది. లిక్కర్ స్కాన్ ద్వారా టిఆర్ఎస్ నేతల స్థాయి తెలిసాక ఎడంగానే ఉంటున్నది. వాపక్ష పార్టీలను నమ్ముకుంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మదిలో ఏముంది? ఏ అండ చూసుకొని ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటున్నారు? ఏమో ఈ లోగుట్టు మొత్తం ఆ 80,000 పుస్తకాలకే తెలియాలి.

_ విమానంలో ఉన్న సౌలతు లు ఏంటంటే
ప్రతి విషయంలో ఆడంబరాన్ని కోరుకునే కేసీఆర్.. ప్రత్యేక విమానం తయారీ లోనూ దానినే కొనసాగించినట్టు తెలుస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ విమానాన్ని తయారు చేయించారు. ప్రత్యేకమైన డ్యాష్ బోర్డ్, విశ్రాంతి తీసుకునేందుకు పడక గది, వంట గది ఇందులో ఏర్పాటు చేశారు. ఏ కంపెనీ తయారు చేసిందో చెప్పనప్పటికీ.. సుమారు ఏడాది క్రితమే ఓ అమెరికా కంపెనీకి ఈ విమానం తయారీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ విమాన తయారీ ప్రతినిధులను కలిసినట్టు సమాచారం.
Also Read: Rajasthan Political Crisis: రాజస్థాన్ సంక్షోభం: కాంగ్రెస్ కు షాకిచ్చిన అశోక్ గెహ్లాట్
[…] […]