Adipurush First Look: రెండున్నరేళ్ల నిరీక్షణకు తెరపడింది. పురాణ పురుషుడు రామునిగా ప్రభాస్ ని పరిచయం చేశారు. ఆదిపురుష్ నుండి ఆయన లుక్ విడుదల చేశారు. విల్లు ఆకాశంలోకి ఎక్కుపెట్టిన ప్రభాస్ లుక్ ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ట్రెడిషనల్ రాముని గెటప్ మిస్ అయిన భావన కలిగింది. భారతీయ సంస్కృతిలో రామునికి విశిష్ట స్థానం ఉంది. ఆయన హిందువుల ఆరాధ్య దైవం. ఇక సినిమా వాళ్లకు రామాయణం ఎవర్ గ్రీన్ హిట్ సబ్జెక్టు. ఆ పాత్ర చేసే అవకాశం దక్కడమంటే నటులు అదృష్టంగా భావిస్తారు. అదే సమయంలో పెద్ద బాధ్యత అని ఒత్తిడి ఫీల్ అవుతున్నారు.

prabhas
రాముడు అంటే మనకు మొదట గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. పౌరాణిక పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎన్టీఆర్… రాముని పాత్రకు ఓ విశిష్ట గుర్తింపు తెచ్చిపెట్టారు. ఒక హీరో ఆ పాత్ర చేస్తున్నారంటే ఎన్టీఆర్ తో పోలికలు పెట్టేస్తారు. అయితే ఆయనకు సెట్ అయినట్టుగా మరొకరి కాదు. ఆయన కంటే అందంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల మనసు అంగీకరించదు. ఈ తరం స్టార్స్ లో ఆ అరుదైన పాత్ర చేసే అవకాశం ప్రభాస్ కి మాత్రమే దక్కింది.
Also Read: Jabardasth Satya Sri: చమ్మక్ చంద్రతో ఎఫైర్ రూమర్స్… ఆయన వల్లే జబర్దస్త్ కి దూరమయ్యాను!
నేడు సర్ప్రైజింగ్ గా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామునిగా ప్రభాస్ ని పరిచయం చేశాడు. ఆకాశం మెరుపులతో హోరెత్తుతుండగా ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టి సమరానికి సై అంటున్నారు. యుద్ధభూమిలో ప్రభాస్ వీరవిహారం చేస్తున్నట్లు ఆ పోస్టర్ ఉంది. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఉంది. అదే సమయంలో కొత్త సందేహాలు రేకెత్తించింది. రాముడు అంటే ఇలానే ఉంటాలనే బౌండరీలు బ్రేక్ చేశారు.

prabhas
చిన్నప్పటి నుండి రాముడు అనగానే నీల మేఘ వర్ణం, ముఖాన నామం, చేతిలో ధనుస్సు, కిరీటం, మీసం లేకుండా ప్రశాంతమైన వర్చసు, పంచెకట్టు, ఒంటి నిండా ఆభరణాలు… గుర్తొస్తాయి. దీనికి భిన్నంగా ఆదిపురుష్ లుక్ ఉంది. కోర మీసం, పంచ కట్టు, ఒంటిపై చొక్కాతో సరికొత్తగా ప్రభాస్ ని పరిచయం చేశారు. దీని వెనుక కారణం అర్థం కావడం లేదు. ఒకవేళ అరణ్యవాస ఘట్టంలో ప్రభాస్ అలా నిరాడంబరంగా కనిపిస్తారేమో. దీనికి సమాధానం తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి.
దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ మైథలాజికల్ మూవీ 2023 జనవరి 12న విడుదల కానుంది. అక్టోబర్ 2న రామజన్మభూమి అయోధ్యలో టీజర్ విడుదల చేస్తున్నారు. విడుదలకు ఇంకా నెలల సమయం మాత్రమే ఉండగా ప్రమోషన్స్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కి జంటగా సీత పాత్ర కృతి సనన్ చేస్తుండగా… విలన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.
Also Read:Bigg Boss 6 Telugu Episode 27: రేవంత్ ను గుక్కపట్టి ఏడిపించిన బిగ్ బాస్.. రూ.100 కోసం ఏడ్చిన గీతక్క