Chandrababu: అనువుగాని చోట అధికులమనరాదు.. ఈ సామేతను చంద్రబాబు గుర్తించుకున్నట్టు లేదు. అందుకే విభిన్న ప్రకటనలు చేసి నవ్వులపాలవుతుంటారు. సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కవుతుంటారు. చంద్రబాబు ముందు చూపుగల నేత. ఏదైనా పనిచేయగల సమర్థుడు. అందుతో తనకు పేరు రావాలని స్వార్థం ఉన్నా బయటకు మాత్రం కనిపించనీయరు. అభివ్రుద్ధి మాత్రమే చేస్తారన్న మంచి రివార్డు అయితే ఉంది. కానీ అది పదే పదే చెప్పుకోవడంతో సోషల్ మీడియా సమాజం తెగ ట్రోల్ చేస్తోంది. చంద్రబాబును పలుచన చేస్తోంది. ఈ మధ్య మా బాబుగారికి తెగ చాదస్తం ఎక్కవ అయ్యిందని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు సమర్థత కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడేది మనసులో ఉంచుకోవడం లేదు. అందునా జగన్ విషయంలో ఇట్టే నోరు పారేసుకుంటున్నారు. ఇతర అంశాల విషయంలో చాలా గుంభనంగా, సంయమనం పాటిస్తున్నారు. తనతో బీజేపీ కలిసి నడవకున్నా, జగన్ కు సహాయ సహకారాలు అందిస్తున్నా బీజేపీ విషయంలో మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. అటు కాంగ్రెస్ ప్రస్తావనా లేదు. నోటికి కళ్లెం వేసుకుంటున్నారు. ఒక్క జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం నోరును కట్టడి చేయలేకపోతున్నారు.

తాజా ప్రకటన చర్చనీయాంశం..
తాజాగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ విషయంలో స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. కార్యక్రమానికి వైసీపీ సర్కారు హైజాక్ చేయడంతో తట్టుకోలేకపోయిన చంద్రబాబు అసలు అల్లూరి విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన చేసిందే తానని చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి.
Also Read: Chiranjeevi changed His Name: షాకింగ్.. తన పేరు ని మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి
కార్యక్రమ నిర్వహణలో వైఫల్యాలను వదిలి తానే ప్రతిపాదన చేశానన్న కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ.. రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేదు. క్షత్రియ సమాజం రూ.3 కోట్లతో భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాయి. హైజాక్ చేశాయి. అధికారంలో ఉన్నాయి కాబట్టి వారేం చెప్పినా కొంత నమ్ముతారు. నిధుల మంజూరుతో పాటు ఇతరత్రా సాయాలు చేసుంటాయని భావిస్తారు. కానీ చంద్రబాబు ప్రకటన మాత్రం ఆయన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తోంది.

పదేపదే అదే మాట..
అమరావతి రాజధాని విషయంలో కూడా చంద్రబాబు తిప్పలపాలవుతుంటారు. రాజధానిని మరో సింగపూర్ గా మారుస్తానని కూడా ప్రకటించారు. ఏపీని అగ్రపథంలో నిలబెడతానని చెప్పుకొస్తారు. ఒకటి రెండు సార్లు ఈ మాట అంటే సరిపోయేది. కానీ అన్ని వేదికల వద్ద పదే పదే ప్రకటనలు చేయడం ద్వారా విపక్షాలకు దొరికిపోతున్నారు. అటు హైదరాబాద్ ను అభివ్రుద్ధి చేసింది తానేనని ఇప్పటికీ ప్రకటించుకుంటారు రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతుంది. హైదరాబాద్ అభివ్రుద్ధి చంద్రబాబు చలువే అయినా.. అదే మాటను చెబుతుండడం సరికాదు. చేసిన అభివ్రుద్ధి ప్రజలు చెప్పుకోవాలి. అప్పటి, ఇప్పటి పాలను భేరీజు వేసుకోవాలి. ప్రజల నుంచి ఆ మాట రాబెట్టాలి. కానీ చంద్రబాబు ఎందుకో ఈ మధ్య పొంతన లేని ప్రకటనలు చేస్తూ.. తనకు తాను చులకన అవుతున్నారని ఆయన అభిమానులు తెగ బాధపడుతున్నారు.
Also Read:Pawan Kalyan- PM Modi: ప్రధాని మోదీ సభకు పవన్ అందుకే రాలేదట?
[…] Also Read: Chandrababu: చంద్రబాబుకు ఆ జాడ్యం ఎక్కువైందట […]