సమాజంలో రోజురోజుకు మానవత్వ విలువలు పతనమవుతున్నాయి. పరువు పేరుతో హత్యలు కొనసాగుతున్నాయి. చెల్లి ఒకరిని ప్రేమించిందని సొంత అన్నదమ్ములే దారుణంగా హత్యచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ సమీపంలోని న్యూమండిలో ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్లోని కొకడ గ్రామానికి చెందిన సుమిత్‌కుమార్, సోను అన్నదమ్ములు. వీరికి ఒక చెల్లి ఉంది. ఆమె భర్త రెండేళ్ల కింద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే ఆ తర్వాత ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో చెప్పి ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఆ చెల్లెలు సోదరుల ముందుంచింది. అయితే దీనిని అన్నదమ్ములిద్దరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ యువకుడితో సంబంధాన్ని మానుకోవాలని చెల్లిలిని పలుమార్లు హెచ్చరించారు.
అయితే ఈ యువకుడిని ప్రేమిస్తున్న ఆ సోదరి వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తరుచూ ప్రేమికులు కలిసుకుంటుండటంతో తమ పరువు పోతుందని అన్నదమ్ములు భావించారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ చెల్లి గొంతు నులిమి హతమర్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ యువకుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన చెల్లిని అన్నదమ్ములే గొంతునిలిమి చంపడం చూస్తుంటే.. మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో అద్ధంపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Brothers kill widowed sister in up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com