Homeజాతీయ వార్తలుBJP silent strategy: బీజేపీ సైలెంట్‌ స్ట్రాటజీ.. నితిన్‌ మార్క్‌ నియామకాలు!

BJP silent strategy: బీజేపీ సైలెంట్‌ స్ట్రాటజీ.. నితిన్‌ మార్క్‌ నియామకాలు!

BJP silent strategy: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హడావుడి లేకుండా, ప్రకటనలు లేకుండా కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం ద్వారా పార్టీ భవిష్యత్‌ ఎన్నికలు, స్థానిక సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది నితిన్‌ నబీన్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రధాన సంస్థాగత చర్యగా గుర్తింపు పొందుతోంది. అనుభవజ్ఞులకు పెద్దపీట.. బీజేపీ ఈ నియామకాల్లో పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన, సైద్ధాంతికంగా బలమైన అనుభవం ఉన్న నాయకులను […]

BJP silent strategy: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హడావుడి లేకుండా, ప్రకటనలు లేకుండా కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం ద్వారా పార్టీ భవిష్యత్‌ ఎన్నికలు, స్థానిక సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది నితిన్‌ నబీన్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రధాన సంస్థాగత చర్యగా గుర్తింపు పొందుతోంది.

అనుభవజ్ఞులకు పెద్దపీట..
బీజేపీ ఈ నియామకాల్లో పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన, సైద్ధాంతికంగా బలమైన అనుభవం ఉన్న నాయకులను ఎంపిక చేసింది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ లోపలి బలాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు కేవలం రూటీన్‌ నియామకాలు కాకుండా, రాష్ట్ర–నిర్దిష్ట సవాళ్లు, అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు.

హర్యాణా పగ్గాలు మహిళకు..
వరుసగా మూడోసారి అధికారం సాధించిన నేపథ్యంలో అర్చనా గుప్తాను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం గమనార్హం. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సమర్థవంతమైన నాయకురాలు అర్చనా గుప్తా సారథ్యంలో పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది బీజేపీ చరిత్రలో మహిళా రాష్ట్ర అధ్యక్షురాలి నియామకం మొదటిసారి కావడం విశేషం. ఇది మహిళా ఓటర్లను ఆకర్షించడం, పార్టీ లోపలి సమానత్వ సందేశాన్ని బలపరుస్తుంది. 2029 ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా ఈ నియామకం హర్యాణాలో బీజేపీ ఆధిపత్యాన్ని మరింత స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది.

కేంద్ర మంత్రికి ఢిల్లీ పగ్గాలు..
రాజధాని ఢిల్లీకి హర్‌‡్ష మల్హోత్రాను అధ్యక్షుడిగా నియమించడం బీజేపీ వ్యూహంలో మరో కీలక అంశం. కింది స్థాయి నుంచి ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌‡్ష మల్హోత్రా అనుభవం ఢిల్లీలో పార్టీని పునరుద్ధరించడంలో సహాయకరంగా ఉంటుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆధిపత్యం ఉన్న ఢిల్లీలో బీజేపీ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియామకం ఆ దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగు.

సిక్కు నేతకు పంజాబ్‌ పగ్గాలు..
పంజాబ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గువల్‌ సింగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం రాజకీయంగా ముఖ్యమైన సంకేతం. సిక్ఖు సమాజానికి చెందిన నాయకుడిని ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఓటర్లకు స్పష్టమైన సందేశం పంపింది. ఆప్‌పై వ్యతిరేకత, కాంగ్రెస్‌పై నమ్మకం తగ్గిన నేపథ్యంలో బీజేపీ సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నియామకం పంజాబ్‌లో పార్టీ విస్తరణకు కొత్త ఊపు ఇవ్వవచ్చు.

త్రిపురకు యువ నేత..
బంగ్లాదేశ్‌ సరిహద్దుతో ఉన్న త్రిపురలో అభిషేక్‌ దేవ్‌ రాయ్‌ను అధ్యక్షుడిగా నియమించడం ఈశాన్య భారతదేశంలో బీజేపీ వ్యూహానికి అనుగుణంగా ఉంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరిహద్దు రాష్ట్రంగా త్రిపుర యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిగింది.

ఈ నాలుగు నియామకాలు బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్రతిబింబిస్తాయి – హడావుడి లేకుండా, సైలెంట్‌గా సంస్థాగత బలాన్ని పెంచుకోవడం. అట్టడుగు నాయకులను ప్రోత్సహించడం, మహిళా నాయకత్వానికి అవకాశం ఇవ్వడం, సామాజిక సమీకరణాలు సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ మార్పులు బీజేపీని కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా, దీర్ఘకాలిక సంస్థాగత బలం కలిగిన రాజకీయ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper