Homeఅంతర్జాతీయంBangladesh Independence: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం.. భారత్‌ విజయం వెనుక రహస్య మిత్రుడు!

Bangladesh Independence: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం.. భారత్‌ విజయం వెనుక రహస్య మిత్రుడు!

Bangladesh Independence: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటం భారత చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ 1971లో స్వాతంత్య్రం పొందింది. ఇందుకోసం భారత్‌ పాకిస్తాన్‌లో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. ఆ సమయంలో సాధించిన విజయం వెనుక సైనిక శక్తితోపాటు విదేశీ సహకారం కూడా కీలకమైంది. ఓ రహస్య మిత్రుడు భారత్‌ విజయం వెనుక ఉన్నాడు. చరిత్రలో దాగిన ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. తూర్పు యూరప్‌లోని పోలాండ్ అందించిన […]

Bangladesh Independence: బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటం భారత చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ 1971లో స్వాతంత్య్రం పొందింది. ఇందుకోసం భారత్‌ పాకిస్తాన్‌లో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. ఆ సమయంలో సాధించిన విజయం వెనుక సైనిక శక్తితోపాటు విదేశీ సహకారం కూడా కీలకమైంది. ఓ రహస్య మిత్రుడు భారత్‌ విజయం వెనుక ఉన్నాడు. చరిత్రలో దాగిన ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. తూర్పు యూరప్‌లోని పోలాండ్ అందించిన సహాయం చాలామందికి తెలియని అధ్యాయం. ఐక్యరాజ్యసమితి వేదికపై దౌత్య వ్యూహాల నుంచి యుద్ధరంగంలో ఉపయోగపడిన ట్యాంకుల వరకు ఆ దేశం పూర్తి మద్దతు ఇచ్చింది.

నదీ ప్రాంతాల్లో ట్యాంకుల అద్భుతాలు..
డిసెంబర్ 1971లో భారత్ యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు తూర్పు పాకిస్తాన్ భూభాగం పెను సవాల్‌గా మారింది. నదులు, చిత్తడి నేలలు నిండిన ఆ ప్రదేశంలో సాధారణ వాహనాలు ముందుకు సాగలేకపోయాయి. అప్పుడు పిటి-76 రకం యాంఫిబియస్ ట్యాంకులు కీలక పాత్ర పోషించాయి. పోలిష్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ వాహనాలు నీటిలోనూ నేలపైనా సులభంగా కదిలి, శత్రు రక్షణ వ్యూహాలను ఛేదించడంలో నిర్ణయాత్మక సహాయం అందించాయి.

ఐక్యరాజ్యసమితిలో మద్దతు
ఆయుధ సరఫరాతోనే ఆగకుండా భద్రతా మండలిలో కూడా పోలాండ్ భారత్‌కు అండగా నిలిచింది. 1971 డిసెంబర్‌లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టి, తూర్పు పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులకు అధికారం అప్పగించాలని, పాకిస్తాన్ సైన్యం వెంటనే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేసింది. 1970 ఎన్నికల్లో షేక్ ముజిబూర్ రెహమాన్ సాధించిన మెజారిటీని ప్రపంచం గుర్తించాలని ఆ దేశం స్పష్టంగా పేర్కొంది.

స్వాతంత్య్రాన్ని గుర్తించిన తొలి దేశం
డిసెంబర్ 16న పాకిస్తాన్ దళాలు లొంగిపోయిన కొద్ది రోజుల్లోనే పోలాండ్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 1972 జనవరి 12న, యుద్ధం ముగిసిన నెల రోజులలోపే, కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించింది. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఈ చర్య గణనీయంగా ఉపయోగపడింది.

నాటి శీతల యుద్ధ వాతావరణంలో సోవియట్ యూనియన్ నేతృత్వంలోని తూర్పు బ్లాక్‌లో పోలాండ్ ముఖ్య సభ్యదేశం. అదే కాలంలో భారత్ సోవియట్‌తో చారిత్రక స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలను మరింత దృఢం చేశాయి. సైనిక సామగ్రి సరఫరా నుంచి అంతర్జాతీయ వేదికలపై దౌత్య మద్దతు వరకు అందించిన సహకారం, 1971లో భారత విజయాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper