spot_img
Homeఆంధ్రప్రదేశ్‌OTS scheme: రుణాలివ్వకున్నా...ఇచ్చిన రుణం వసూలుకు ఏపీ సర్కారు స్పెషల్ స్కీమ్..!

OTS scheme: రుణాలివ్వకున్నా…ఇచ్చిన రుణం వసూలుకు ఏపీ సర్కారు స్పెషల్ స్కీమ్..!

OTS scheme: జనరల్‌గా ప్రభుత్వాలు వివిధ సామాజికవర్గాల్లో వెనుకబడిన వారికి రుణాలు ఇచ్చే సంగతి అందరికీ తెలుసు. ఇందుకుగాను సెపరేట్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలను ఇస్తుంటారు. తద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించొచ్చని అనుకుంటారు. అలానే ఎస్సీ, బీసీ, కాపు తదితర కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం కూడా సెపరేట్ కొర్పొరేషన్ ఏర్పాటు చేసింది. అలా పలు కార్పొరేషన్స్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు.

OTS scheme
OTS scheme

అలా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం నిధులను లబ్ధిదారులకు అందజేస్తుంది. అయితే, ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వకపోవడం గమనార్హం. అలా వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వకపోయినప్పటికీ గతంలో ఇచ్చిన రుణాల వసూళ్లపై మాత్రం ఏపీ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది.

గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ వద్ద లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోతే, నోటిసులు పంపి ఊరుకున్నాయి. కానీ, ఈ సారి ఏపీ సర్కారు అలా ఊరుకునేలా లేదు. గతంలో తీసుకున్న రుణాలను కంపల్సరీగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నోటీసులతో పాటు హెచ్చరికలు పంపుతూ, వెంటనే రుణం తిరిగి చెల్లించాలని చెప్పాలని యోచిస్తుంది.

Also Read: సినీ ఇండస్ట్రీపై జగన్ పంతానికి కారణం తెలిసింది?

అలా కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల నుంచి కనీసంగా రూ.1,000 కోట్లు అయినా తిరిగి వసూలు చేయాలని ఏపీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఒకవేళ కార్పొరేషన్ లోన్ తిరిగి చెల్లించేందుకుగాను లబ్ధిదారులు మొండికేస్తే కనుక వన్ టైమ్ సెటిల్మెంట్ తరహా మరో స్కీమ్ ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సర్కారు ఇటీవల ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి డబ్బులు కట్టించుకుని రెగ్యులరైజేషన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే కార్పొరేషన్లపైన ప్రజెంట్ ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. అలా ఏపీ సర్కారు కార్పొరేషన్ల లబ్ధిదారులను కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వినికిడి. లబ్ధిదారులు ఎప్పుడో రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా అలానే ఉన్నట్లయితే వారిపైన ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్.

Also Read: పండుగ పూట థియేటర్లపై ఏపీ సర్కారు దాడులు.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper