Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu- Vangaveeti Radha Krishna: చంద్రబాబుకు భారీ షాక్.. త్వరలోనే జనసేనలోకి ఆ సంచలన నేత

Chandrababu- Vangaveeti Radha Krishna: చంద్రబాబుకు భారీ షాక్.. త్వరలోనే జనసేనలోకి ఆ సంచలన నేత

Chandrababu- Vangaveeti Radha Krishna: సీనియర్ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధాక్రిష్ణ ఆ పార్టీని వీడుతారా? జనసేన గూటికి చేరుతారా? పార్టీ మారే విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వచ్చారా? తన తండ్రి వంగవీటి మోహన్ రంగా జయంతి నాడు ముహూర్తం నిర్ణయించుకున్నారా? పవన్ వచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు నిజం చేస్తున్నాయి. అయితే దీనిపై రాధాక్రిష్ణ ఎటువంటి ప్రకటన చేయలేదు. అటు జనసేన కార్యాలయ వర్గాల నుంచి కూడా ఎటువంటి స్పష్టత లేదు. అయితే గత కొద్దిరోజులు రాజకీయ వర్గాల్లో మాత్రం తెగ ప్రచారం సాగుతోంది.

Chandrababu- Vangaveeti Radha Krishna
Chandrababu- Vangaveeti Radha Krishna

ప్రస్తుతం రాధాక్రిష్ణ టీడీపీలో ఉన్నా ఏమంత యాక్టివ్ గా లేరు. కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఆయనలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల కిందట తన హత్యకు భారీ స్కెచ్ జరిగిందని రాధాక్రిష్ణ బాంబు పేల్చారు. రెక్కీ కూడా నిర్వహించారని ప్రకటించారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. సంచలనం రేకెత్తించింది. దీంతో ప్రభుత్వం స్పందించి గన్ మెన్లను నియమించిన రాధా నో చెప్పారు. అటు తరువాత చంద్రబాబు పరామర్శించడం, దానికి రాధాతో పాటు కుటుంబసభ్యులు కూడా ఎంతగానో సంతోషించారు. టీడీపీతో మంచి సంబంధాలే నెరుపుతూ వచ్చారు. అయితే ఇటీవల ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం అయితే సాగుతోంది. దీనిని ఆయన ఖండించకపోవడంతో చేరిక దాదాపు ఖాయమైందన్న వాదన వినిపిస్తోంది.

Also Read: CM KCR Vijayawada Tour: మూడేళ్ల తర్వాత విజయవాడకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

-వంగవీటి జయంతి రోజున,,
పవన్ కళ్యాణ్ త్వరలోనే విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలోనే జనసేనాని సమక్షంలో వంగవీటి రాధా జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ చేరికలు కేవలం రాధాతోనే ఆగవని.. మరింతమంది కాపు ముఖ్య నేతలు,వంగవీటి అభిమానులు అంతా జనసేనలో చేరబోతున్నట్టు తెలిసింది. కాపు నేతలంతా జనసేన గూటికి రాబోతున్నారని సమాచారం. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమంటున్నారు.

వంగవీటి రాధా కాంగ్రెస్ లో ఉండేవారు. అక్కడ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎక్కడా రాజకీయంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీనికి తొందరపాటు నిర్ణయాలే కారణమన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి పార్టీమారుతారా? లేదా? అన్నది సందేహం వ్యక్తమవుతోంది. ఒక వేళ చంద్రబాబు పొత్తుల వ్యూహంలో భాగంగా వ్యూహాత్మకంగా రాధాక్రిష్ణను జనసేనలోకి పంపిస్తున్నారా? అన్న అనుమానాలున్నాయి. వంగవీటి కుటుంబం కాపు సామాజికవర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. అటువంటి కుటుంబం నుంచి రాధాక్రిష్ణ జనసేనలో చేరితో అటోమెటిక్ గా కాపు సామాజికవర్గం టీడీపీ జనసేన కూటమి వైపు మరలే అవకాశముందని భావిస్తున్నారు.

Chandrababu- Vangaveeti Radha Krishna
Vangaveeti Radha Krishna

-తాజా పరిణామాలతో…
ఇప్పటికే కాపులు వైసీపీకి దాదాపు దూరమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడుగడుగునా కాపులకు అన్యాయం జరుగుతోంది. అంతకు ముందు చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను సైతం జగన్ రద్దుచేశారు. కాపులకు ప్రత్యేకంగా ఉన్న పథకాలను సైతం తొలగించారు. దీంతో కాపులు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ ను కాదని జగన్ కు పట్టం కట్టామని.. ఇది తప్పుడు చర్యగా గుర్తించారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గుంపగుత్తిగా ఓట్లు వేయాలని నిర్థారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాధాక్రిష్ణ జనసేనలో చేరితే కాపుల ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశముంది. అందుకే రాధాక్రిష్ణ జనసేనలో చేరేందుకు మొగ్గుచూపారని.. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న టాక్ అయితే నడుస్తోంది. కానీ గత కొన్నేళ్ల నుంచే రాధాక్రిష్ణ జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు ఎప్పటి నుంచో వంగవీటి కుటుంబానికి ప్రధాన్యత ఇస్తూ వస్తున్నారు.

Also Read:AP Deputy Speaker Kona Raghupathi: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా.. అసలు కారణం ఏంటి..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular