Homeహెల్త్‌Warm water : గోరువెచ్చని నీరు అందరికి సెట్ కాదు. ఎందుకంటే..?

Warm water : గోరువెచ్చని నీరు అందరికి సెట్ కాదు. ఎందుకంటే..?

నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో సమస్యలకు నీరు ద్వారా చెక్ పెట్టవచ్చు. బాడీ డీహైడ్రేట్ అవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే నిత్యం నీరు తీసుకోవాలి. ప్రతి రోజు 6 నుంచి 8 లీటర్ల నీరు తీసుకోవాలి అంటారు నిపుణులు. ఇక వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు గోరువెచ్చని నీరుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ముఖ్యంగా చలికాలం చల్ల నీరు తాగాలంటే మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కాస్త గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకుంటారు. ఈ నీరు వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. నీటిలో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. కానీ ఈ నీరు ప్రతి ఒక్కరు తాగడం కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకు అనే వివరాలు ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.

Warm water : గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అయితే ఈ నీరు ప్రతి ఒక్కరికి మేలు చేయదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సార్లు గోరువెచ్చని నీటిని తీసుకోవడం కామన్. సాధారణంగా, బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, పలు సమస్యలతో బాధపడేవారు.. వేడి లేదా గోరువెచ్చని నీరు తాగుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి.. కొంతమంది వ్యక్తులు గోరువెచ్చని నీటిని తీసుకోవడం మానుకోవాలి.. ఎందుకంటే, ఇది చాలా వ్యతిరేక ప్రభావాలను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. కొందరికి మాత్రం ఈ అలవాటు చేటేను చేకూరుస్తుంది.

ఇలాంటి వారు గోరువెచ్చని నీటిని తాగకూడదు..
జలుబు – దగ్గులో..
జలుబు – దగ్గు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. వేడి నీటిని తీసుకోవడం వల్ల వారి గొంతు వాపు, చికాకు పెరుగుతుంది.. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. బదులుగా, వారు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి.. ఇది వారి గొంతు పొడిగా ఉండటానికి సహాయపడుతుంది.

చిన్న పిల్లలు..
చిన్న పిల్లలు పెద్దల మాదిరిగా వేడి నీటిని తాగకూడదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. ఇలాంటి వారికి వేడి నీరు వారి కడుపుకు హాని కలిగిస్తుంది. అందుకే నార్మల్ వాటర్ తీసుకోవాలి. లేదంటే ఎన్నో కడుపు సంబంధ సమస్యలు వస్తాయి.

కాలేయ రోగులు..
కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. వారు చల్లని నీరు త్రాగాలి. వైద్యుల సలహా మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలి. కాలేయం చాలా సున్నితమైనది. దానిలో ఏదైనా సమస్య వస్తే మాత్రం శరీరంలోని వివిధ విధులు ప్రతికూలంగా ప్రభావితం అవుతుంటాయి.

దంతాల సున్నితత్వంతో బాధపడేవారు..
దంతాల సున్నితత్వం ఉన్నవారికి, వేడి – చల్లటి పదార్థాలు రెండూ నొప్పిని పెంచుతాయి. మీరు సమస్యను నివారించాలంటే.. సాధారణ నీటిని మాత్రమే తాగండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper