Homeలైఫ్ స్టైల్Tamarind Seeds: సర్వరోగాల నుంచి నివారణ పొందాలంటే.. ఈ చిన్న విత్తనాన్ని ఇలా ఉపయోగించాల్సిందే!

Tamarind Seeds: సర్వరోగాల నుంచి నివారణ పొందాలంటే.. ఈ చిన్న విత్తనాన్ని ఇలా ఉపయోగించాల్సిందే!

Tamarind Seeds: చింతపండు గురించి అందరికీ తెలిసిందే. దీన్ని ఎక్కువగా రసం, పప్పు చారు, కూరల్లో వాడుతుంటారు. పూర్వ కాలంలో ఎక్కువగా చింత పండు చిగురుతో కూడా రకరకాల వంటలు చేసేవారు. అయితే ఈ చింతపండును వాడిన తర్వాత చాలా మంది ఆ గింజలను పడేస్తారు. చింత పండు, వాటి చిగురు వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ గింజలతో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింత పండు గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ గింజల్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి.

కొందరు కడుపు సంబంధిత సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ చింత పండు గింజలు బాగా సహాయపడతాయి. ఇందులోని కాల్షియం, భాస్వరం కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. అలాగే ఎముకలను బలపరచడంతో పాటు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి విముక్తి చెందేలా కూడా సాయపడతాయి. ఈ గింజలు పురుషులు, మహిళలు ఇద్దరిలో లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని ఏదైనా భాగంలో వాపును తగ్గించడంతో పాటు నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. దీనిని రోజూ డైట్‌లో ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు.

ఈ చింతపండు గింజలను బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటితో పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలు లేదా నీటిలో కలిపి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. రోజులో ఏదో ఒక సమయంలో ఈ గింజల పొడిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గింజల పొడినే కాకుండా చింత పండు రసాన్ని కూడా కొందరు ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ రసాన్ని ఎక్కువగా ఉత్తర భారత దేశంలో కంటే దక్షిణ భారత దేశంలోనే వండుకుని తింటారు. చింతపండును తప్పకుండా అన్నింట్లో వండుతారు. ముఖ్యంగా చింత పండు లేకపోతే అసలు సాంబార్ టేస్ట్ కూడా రాదు. కొందరు కూరల్లో కూడా చింత పండు రసాన్ని వాడుతుంటారు. అలాగే చింత చిగురుతో కొందరు పులిహోర వంటివి చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper