Benefits of walking daily: ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. నేటి కాలంలో అనేక రకాల ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది. అంతేకాకుండా శారీరకంగా శ్రమ లేకుండా పోతుంది. ఈ తరుణంలో శరీరం నుంచి చెమటను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఉదయం లేదా సాయంత్రం కచ్చితంగా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామంలో భాగంగా నడక చేసినా కూడా సరిపోతుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ నడక సాధారణంగా కాకుండా టెక్నికల్ గా చేస్తే శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుందని అంటున్నారు. మరి ఏ విధంగా నడక సాగిస్తే బరువు తగ్గుతారు?
కొంతమంది వాకింగ్ అనగానే చాలా స్లోగా నడుస్తూ ఉంటారు. అలాగే ఏదో బాధలో ఉన్నట్లు చేస్తారు. అలా కాకుండా క్రమ పద్ధతిలో నడవడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. క్రమ పద్ధతిలో అంటే కేవలం సాధారణంగా కాకుండా మందు అడుగులపాటు స్పీడ్గా నడవాలి.. మరో 100 అడుగులపాటు స్లోగా నడవాలి. ఇలా కనీసం వెయ్యి అడుగుల వరకు మారుస్తూ ఉండాలి. అయితే వయసులో ఉన్నవారు మరింతగా ప్లాన్ చేసుకొని ఎక్కువసేపు నడుస్తూ ఉండాలి. ఇలా కనీసం 30 నిమిషాల పాటు మార్చి మార్చి నడవడం వల్ల శరీరంలో అనేక మార్పులు చూస్తారు. అంతేకాకుండా అదనపు కొవ్వు కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇలా క్రమ పద్ధతిగా కాకుండా ఒకే విధంగా స్పీడ్ గా నడిచినా సమస్యలే ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి వేగంగా నడవడం వల్ల గుండెపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాకాకుండా స్లోగా నడవడం వల్ల శరీరం అలసిపోకుండా కొవ్వు అలాగే ఉండిపోతుంది. ఇలా మార్చి మార్చి నడవడం వల్ల గుండెకు ఎలాంటి నష్టం జరగకుండా కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వాకింగ్ ను క్రమ పద్ధతిలో చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వాకింగ్ చేసే సమయంలో మరొక స్నేహితుడు ఉంటే మరీ మంచిది అని అంటున్నారు. ఎందుకంటే ఏదైనా విషయంపై మాట్లాడుతూ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నడవడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలా వీలుకాని వారు స్వచ్ఛమైన సంగీతం వింటూ కూడా నడవడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
ఇక వాకింగ్ చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. సిటీ మధ్యలో ఉండేవారు పార్కుల్లోకి.. చివరన ఉన్నవారు పచ్చని ప్రదేశంలోకి వెళ్లి నడవడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అలాగే వాకింగ్తో పాటు చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరం యాక్టివ్ అవుతుంది. ఈ విధంగా ఒకే రకంగా కాకుండా వివిధ పద్ధతుల ద్వారా నడక చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని వైద్యులు సూచిస్తున్నారు.