Thati Kallu : హైదరాబాదులో కల్తీ కల్లు తాగి 9 మంది మృతిచెందిన సంఘటన విషాదాన్ని నిలిపింది. కల్తీ కల్లు తో ఎప్పటికైనా ప్రమాదమేనని.. దీనిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్తీ కల్లు విక్రయించే డిపోలపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఒకవైపు తాటి, ఈత కల్లు ఆరోగ్యం అని వైద్యులు చెబుతుండగా.. మరోవైపు కల్లు డిపోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్ మేరకు కల్లు డిపోలను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే వీటిని మూసివేయడం ద్వారా గీత కార్మికులు ఉపాధిని కోల్పోతుంటారని కొందరు వాపోతున్నారు. మరోవైపు కల్లు తో ఎప్పటికైనా ప్రమాదమేనని అంటున్నారు. అసలు నిజంగానే కల్లు తో ప్రమాదమా? మరి గీత కార్మికుల పరిస్థితి ఏంటి?
Also Read: మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?
ప్రకృతి సహజసిద్ధంగా అందించే కల్లు తాగడం వల్ల మానవ శరీరానికి ఆరోగ్యమే అని వైద్యులు సైతం తేల్చారు. ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. దీంతో కొంతమంది ప్రత్యేకించి కల్లు తాగుతూ ఉంటారు. అయితే గీత కార్మికులు చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది తాటి, ఈత కల్లు కంటే విస్కీ, బీర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతో తాము ఉపాధిని కోల్పోతున్నారని పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో కల్లు డిపోలను మూసి వేయడం ద్వారా మరింత నష్టపోయే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు. వాస్తవానికి పట్టణాలు, నగరాల్లో ఉండే కల్లు డిపోలకు, గ్రామాల్లో కల్లు గీసే కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత వాతావరణం లో తాటి చెట్ల నుంచి కల్లు అనుకున్నంతగా రావడం లేదు. ఒక గ్రామంలో ఒక గీతా కార్మికుడు 50 నుంచి 60 లీటర్ల కల్లు ను మాత్రమే గీస్తున్నారు. ఇది గ్రామంలోని వారికే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చేవారు కల్లు కావాలని అడిగితే ఒక్కోసారి లేదని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందని అంటున్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రస్తుతం యువకులు ఎక్కువగా తాటి చెట్లు ఎక్కి కల్లు గీయడానికి ఆసక్తి చూపించడం లేదు.
Also Read: మీడియం రేంజ్ హీరోలకు భవిష్యత్తు లేనట్టేనా..? లేటెస్ట్ గణాంకాలు ఏమి చెప్తున్నాయంటే!