Homeబిజినెస్Top 8 upcoming cars in India 2026 -27: కొత్త SUV ల సందడి.....

Top 8 upcoming cars in India 2026 -27: కొత్త SUV ల సందడి.. టాటా నుంచి మారుతి వరకు రాబోతున్న అదిరిపోయే కార్లు..

Top 8 upcoming cars in India 2026-27: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి రాబోయే రెండు సంవత్సరాలు కొత్త కార్ల సందడి కనిపించబోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు హైబ్రిడ్.. పెట్రోల్.. డీజిల్ SUV ల మీద వాహన తయారీ సంస్థలు దృష్టిపెట్టాయి. టాటా మోటార్స్.. మారుతి సుజుకి.. మహీంద్రా. హ్యుందాయ్.. టయోటా బడి కంపెనీలు కొత్త మోడల్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 2026 -27 లో కొత్త డిజైన్.. […]

Top 8 upcoming cars in India 2026-27: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి రాబోయే రెండు సంవత్సరాలు కొత్త కార్ల సందడి కనిపించబోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు హైబ్రిడ్.. పెట్రోల్.. డీజిల్ SUV ల మీద వాహన తయారీ సంస్థలు దృష్టిపెట్టాయి. టాటా మోటార్స్.. మారుతి సుజుకి.. మహీంద్రా. హ్యుందాయ్.. టయోటా బడి కంపెనీలు కొత్త మోడల్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 2026 -27 లో కొత్త డిజైన్.. అద్భుతమైన టెక్నాలజీ.. మెరుగైన మైలేజ్.. ఎక్కువ రేంజ్ తో కార్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

2026 లో రాబోతున్న కార్లు

Toyota Innova high cross facelift

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే భారత మార్కెట్లోకి మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ఈ కారుకు ఫేస్ లిఫ్ట్ వర్షం తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతోంది. కొత్త డిజైన్ మార్పులతోపాటు ఇంటీరియర్ విషయంలోనూ కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇంజన్ విషయానికి వస్తే పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎంపికలు కొనసాగే అవకాశం ఉంది.. సిట్టింగ్ విషయంలో 7,8 సీటర్ వేరియంట్లు ఉంటాయి. దీని అంచనా ధర 20 నుంచి 30 లక్షల వరకు ఉంది. నవంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

JSW J tour T2

భారత మార్కెట్లో ఆఫ్ రోడింగ్ SUV లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని JSW మోటార్స్ Jetour T2 ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. బాక్సి డిజైన్.. భారీ బాడీ.. ఎస్ యూవీ తరహాలో ఈ కారులో స్టైలింగ్ కల్పించారు. ఇది టయోటా ఫార్చునర్.. మహీంద్రా వంటి ఎస్ యూవీ లకు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. అయితే మనదేశంలో వెర్షన్ ఇంజన్.. ఫీచర్లు.. తరలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దీని అంచనా ధర 30 నుంచి 40 లక్షల మధ్య ఉంది. వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Volkswagen virtus facelift

SUV ల హవా కొనసాగుతున్నప్పటికీ సెడాన్ కార్లకు కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోక్స్ వ్యాగన్ తన విర్టస్ మోడల్ కు ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముందుభాగం డిజైన్.. లైటింగ్.. ఇంటీరియర్.. ఇన్ఫో టైన్మెంట్ వ్యవస్థలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇంజన్ 1.0 లీటర్.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఎంపికలుగా ఉండే అవకాశం ఉంది. దీని ధర 11 నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. డిసెంబర్లో విడుదల కాబోతోంది.

Maruti Suzuki Fronx face lift

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మన విచ్చే మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫేస్ లిఫ్ట్ వెర్షన్ పై అంచనాలు పెరిగిపోయాయి. కొత్త డిజైన్.. అదనపు ఫీచర్లు.. ఇంటీరియర్ అప్డేట్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది. టర్బో పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంజన్ పరంగా పెట్రోల్.. సిఎన్జి ఉంటుంది. అంచనా ధర 7 నుంచి 12 లక్షల వరకు ఉండవచ్చు. వచ్చేయడాది విడుదలకు అవకాశం ఉంది.

Mahindra vision S

మహీంద్రా తన ఎస్ యు వి భాగాన్ని మరింత విస్తరించినందుకు కొత్త మోడల్స్ మీద పనిచేస్తుంది. ఇందులో భాగంగా విజన్ ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాన్సెప్ట్ రూపంలో ఆకట్టుకున్న ఈ ఎస్ యు వి వెర్షన్లో కూడా ప్రత్యేకమైన డిజైన్ వచ్చే అవకాశం ఉంది. కంపాక్ట్ ఎస్ యు వి విభాగంలోకి వచ్చే ఈ కారు ఆధునిక టెక్నాలజీ.. కనెక్టెడ్ ఫీచర్లు.. కొత్త ఇంటీరియర్ తో యూసర్లను ఆకట్టుకోవచ్చని తెలుస్తోంది. దీని అంచనా ధర 10.50 లక్షల నుంచి 17.50 ఉంటుందని తెలుస్తోంది. వచ్చేయడాది విడుదలకు అవకాశం ఉంది.

Hyundai next generation creta

హ్యుందాయ్ క్రెటాకు భారతదేశంలో విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పుడు తదుపరితరం క్రెటా మీద అంచనాలు పెరిగిపోయాయి. కొత్త ప్లాట్ఫారం.. ఆధునిక డిజైన్.. సేఫ్టీ ఫీచర్లు.. అప్డేట్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్.. డీజిల్ వేరియంట్ లో ఇంజన్ ఉంటుంది. అంచనాధర 11 నుంచి 21.50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Skoda superb

ప్రీమియం సెడాన్ విభాగంలో స్కోడా సూపర్బ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విశాలమైన క్యాబిన్.. విలాసవంతమైన ఇంటీరియర్.. శక్తివంతమైన ఇంజన్ ఇందులో ఉండబోతున్నాయి. వచ్చే ఎడాది ఇది మన దేశ మార్కెట్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంజన్ పెట్రోల్.. మైల్డ్ హైబ్రిడ్ ఎంపిక ఉండే అవకాశం ఉంది. 55 నుంచి 60 లక్షల వరకు దీని ధర ఉంటుంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోతోంది.

Audi Q7 new generation

లగ్జరీ ఎస్ యు విభాగంలో ఆడి q7 కు మంచి గుర్తింపు ఉంది. 2027లో కొత్త అప్డేట్స్ తో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ఎస్ యు వి లో డిజైన్.. టెక్నాలజీ.. సేఫ్టీ ఫీచర్ల పరంగా మార్పులు ఉండవచ్చు.. ఇంజన్ పెట్రోల్.. మైల్డ్ హైబ్రిడ్.. అంచనా ధర 96 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. 2027 చివరి నెలలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే 2026 -27 భారత కార్ల మార్కెట్లో ఎస్ యు విలు.. హైబ్రిడ్ కార్లు.. ఎలక్ట్రానిక్ వాహనాల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలి అనుకునే వారి నుంచి లగ్జరీ ఎస్ యు వి కోసం ఎదురుచూస్తున్న వారి వరకు కొత్త మోడల్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మారుతి ఫ్రాంక్స్, మహీంద్రా విజన్ ఎస్.. హ్యుందాయ్ క్రెటా కొత్త వెర్షన్ల మీద మిడిల్ క్లాస్ కస్టమర్లలో ఆసక్తి ఉండే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper