Ranapala Plant : ప్రకృతిలో లభించే ఎన్నో చెట్లు మానవ ఆరోగ్యానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే పూర్వకాలంలో చాలామంది చెట్లను పెంచుకునేవారు. కొందరు పెద్దలు చెట్ల ఆకులు, పసరు తోనే వైద్యం చేసుకునేవారు. కానీ కాలం మారుతి నాకొద్ది పట్టణీకరణ లేదా నగరాభివృద్ధి కారణంగా చెట్లను నరికివేస్తున్నారు. దీంతో చాలా చోట్ల చెట్లు మాయమవుతున్నాయి. అంతేకాకుండా పూర్వకాలంలో ఉపయోగించిన కొన్ని చెట్లను ఇప్పుడు వాడడం లేదు. మూఢనమ్మకాలు లేదా ఇతర కారణాలు చెబుతూ ఇంగ్లీష్ మందులను ఎక్కువగా వాడుతున్నారు. కానీ కొన్ని చెట్లు ఆకులు, పసరు వల్ల మెడిసిన్ చేయలేని వైద్యం అందుతుంది. అందుకే ఆ చెట్లను ప్రస్తుతం ఇంట్లోనైనా తెచ్చుకోవాలని అంటున్నారు. ఇంతకీ ఆ చెట్లు ఏవంటే?
Also Read : ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటున్నారా? జపనీస్ సీక్రెట్ ఇదే..
ప్రస్తుత కాలంలో రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. కొన్ని రోగాలకు మెడిసిన్ చేయలేని వైద్యం చెట్ల ఆకులు పనిచేస్తాయని పెద్దలు చెప్తున్నారు. అలా వైద్యం అందించే చెట్లలో రణపాల చెట్టు ఒకటి. చాలామందికి రణపాల ఆకు గురించి తెలిసే ఉంటుంది. కానీ నేటి కాలంలోనే యువతకు ఈ చెట్ల గురించి పెద్దగా అవగాహన ఉండదు. రణపాల చెట్లు ఒకప్పుడు అడవిలో మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు దీనిని ఇంట్లోనూ కూడా పెంచుకుంటున్నారు. ఈ ఆకు పెంచడానికి పెద్దగా కష్టం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే కుండీలోనూ రణపాలను పెంచుకోవచ్చు. రణపాల చెట్టు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే విడిచిపెట్టరు.
రణపాల ఆకు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీ సమస్య ఉన్నవారు లేదా కిడ్నీలో రాళ్లు ప్రారంభమవుతున్నాయని తెలిసిన వాళ్ళు రణపాల ఆకులు ఉదయం లేదా సాయంత్రం రణపాల ఆకులు నేరుగా తినాలని కొందరు చెబుతున్నారు. దీనిని నేరుగా తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అని పేర్కొంటున్నారు. రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్, యాంటీ పంగల్, అనాఫి లాక్టిక్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవర్ నాయిడ్లు, స్టెరాయిడ్లు క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడతాయని అంటున్నారు. రణపాల ఆకులు ఉదయం పరిగడుపున తినాలని.. అలా చేయడం వల్ల శరీరంలోని అనేక రకాల బ్యాక్టీరియాను తొలగిస్తానని పేర్కొంటున్నారు.
మీ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎన్నో ఉన్నాయని గుర్తించారు. అందువల్ల దీనిని తినడం వల్ల బీపీ రోగులకు అలాగే మధు మేహులకు ఎంతో ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇక జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో ఉపశమనం పొందుతారని అంటున్నారు. అలాగే చిన్న చిన్న గాయాలు అయినా అవి మానకపోయినా.. రణపాల ఆకుతో ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. అయితే రణ పాల ఆకులు ఉదయం శుభ్రం చేసి తినాలని.. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా పరిగడుపున తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటున్నారు. ప్రస్తుత కాలంలో దీనిని చాలామంది ఇంట్లోనే పెంచుకుంటున్నారని. ఒకవేళ ఈ ఆకులను తీసుకొచ్చి ఇంట్లో కుండీలో పెట్టిన పెరుగుతాయని అంటున్నారు.