Green Tea: ఉదయం టీ తాగడం చాలా అవసరం. నిజమే ఇది ఒక అవసరం లా మారింది. చాలా మంది టీ, కాపీలతో తమ ఉదయాన్ని మొదలు పెడతారు. టీ, కాఫీ కంటే కొందరు గ్రీన్ టీ కూడా తాగుతారు. మరి ఈ గ్రీన్ టీ మంచిదా? నార్మల్ టీ మంచిదా? అనే అనుమానం మీలో కచ్చితంగా ఉండే ఉంటుంది కదా. ఇంతకీ ఏ టీ తాగాలో? తెలుసుకుందామా?
Also Read: పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది..?
గ్రీన్ టీలో అసలు పాలు ఉండవు. అదే నార్మల్ టీలో పాలు ఉంటాయి. 100 ml పాలలో 80 నుంచి 90 కేలరీలు ఉంటాయి. అందుకే ఈ నార్మల్ టీ తాగితే ఈ కాలరీలు లభిస్తాయి. ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ కాలరీలు అవసరం లేదు. అందుకే నార్మల్ టీకి బదులు గ్రీన్ టీ తాగడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. గ్రీన్ టీలో చక్కెర ఉండదు. అదే మామూలు టీలో మాత్రం కచ్చితంగా చక్కెర ఉంటుంది. కొందరు మరింత ఎక్కువే తాగుతారు. 100 గ్రాముల చక్కెరలో 400 గ్రాముల కేలరీలు ఉంటాయి. అంటే నార్మల్ టీ కంటే గ్రీన్ టీ బెటర్.
గ్రీన్ టీ లో నీరు, కషాయం మాత్రమే ఉంటుంది కాబట్టి అందులో జీరో క్యాలరీలు ఉంటాయి. సో బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక. అయితే కొందరు టీ తాగితే బరువు పెరుగుతారు అని నమ్ముతారు. కానీ ఇందులో కూడా నిజం ఉంది. ఎందుకంటే అందులో ఉండే క్యాలరీలే దీనికి కారణం. చక్కెర, పాలలో ఉండే క్యాలరీల వల్ల బరువు పెరుగుతారు. కానీ కేవలం ఒక కప్పు, రెండు కప్పులకు మాత్రమే కాదు. స్టాఫ్ తో ఒక సారి, కొలీగ్ తో ఒకసారి, ఇంట్లో ఉదయం, సాయంత్రం ఒకసారి ఇలా ఓ 8 నుంచి 10 సార్లు టీ తాగేవారు కచ్చితంగా బరువు పెరుగుతారు అంటున్నారు నిపుణులు.
బరువు, షుగర్ లు పెరగకుండా ఉండటానికి ఈ పంచదార, షుగర్ తీసి గ్రీన్ టీ తాగాలి. అయితే టీ కూడా మంచిదే. ఇందులో థీన్ అనే మెడిసిన్ ఉంటుందట. ఒక కప్పు ఛాయ్ లో 150 మి. గ్రాముల థీన్ ఉంటుంది. దీని వల్ల శరీరం చాలా త్వరగా యాక్టివ్ అవుతుంది. చాలా ఉత్సాహంగా పని కూడా చేస్తారు. ప్రయోజనం ఉందని ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. పదే పదే తాగితే మీరు నీరు కూడా తాగలేరు. నీరు కంటెంట్ చాలా తక్కువ అవుతుంది. సో జాగ్రత్త. మీరు బరువు లేకపోతే ఈ టీ ని తాగవచ్చు. కానీ రోజు రెండు కప్పులు మాత్రమే తాగండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.