Homeలైఫ్ స్టైల్Summer Hair Fall Remedies At Home: వేసవిలో జుట్టు రాలుతోందా.. ఇంట్లోనే ఇలా చేస్తే...

Summer Hair Fall Remedies At Home: వేసవిలో జుట్టు రాలుతోందా.. ఇంట్లోనే ఇలా చేస్తే సమస్య పరిష్కారం..

Summer Hair Fall Remedies At Home: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. దీంతో ఆరోగ్యంతో పాటు జుట్టుపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చెమట, ధూళి, కాలుష్యం, ఎండ కిరణాలు కలిసి తల చర్మాన్ని (స్కాల్ప్) బలహీనపరుస్తాయి. దీనివల్ల జుట్టు వేర్లు బలహీనమై హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతుంది. చాలామంది ఈ సమస్యను సాధారణంగా తీసుకుంటారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో జుట్టు పలుచబడటం, రఫ్‌గా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ముందుగా, ఎండలో బయటికి వెళ్లేటప్పుడు తలను కవర్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాటన్ క్లాత్, స్కార్ఫ్ లేదా క్యాప్ ఉపయోగించడం ద్వారా నేరుగా సూర్యరశ్మి తలకు తాకకుండా కాపాడుకోవచ్చు. దీని వల్ల స్కాల్ప్ డ్యామేజ్ తగ్గి, జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతుంది. ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి వస్తే ఇది తప్పనిసరి అలవాటు చేసుకోవాలి.జుట్టు ఆరోగ్యానికి ఆయిల్ మసాజ్ ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా కొబ్బరి నూనెను కుదుళ్ల దాకా పట్టించి సున్నితంగా మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది జుట్టు వేర్లను బలంగా ఉంచి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. వారానికి కనీసం 2-3 సార్లు ఇలా నూనె మర్దన చేయడం మంచిది. కొబ్బరి నూనెలో సహజ గుణాలు ఉండటంతో ఇది తల చర్మాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది.

తల స్నానం చేసే విధానం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలా మంది వేడి నీటితో తలస్నానం చేస్తారు, ఇది స్కాల్ప్‌ను పొడిగా చేసి జుట్టు రాలడానికి కారణమవుతుంది. అందుకే గోరు వెచ్చటి నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అదేవిధంగా కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలకు బదులుగా మైల్డ్, కెమికల్-ఫ్రీ షాంపూలను వాడటం మంచిది. అవసరమైతే నేచురల్ కండిషనర్లను ఉపయోగించడం ద్వారా జుట్టు మెత్తగా, ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరానికి సరిపడా నీరు అందకపోయినా జుట్టుపై ప్రభావం పడుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ వల్ల స్కాల్ప్ డ్రై అయి హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జుట్టుకు అవసరమైన తేమను కూడా అందిస్తుంది.

ఆహారపు అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యానికి కీలకం. ఆకుకూరలు, తాజా పండ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారం స్కాల్ప్‌కు పోషణ అందిస్తుంది. జంక్ ఫుడ్ తగ్గించి, హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు. స్టైలింగ్ కోసం హీటింగ్ డివైజ్‌లను ఉపయోగించడం తగ్గించాలి. హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటెనర్లు వంటి పరికరాలు జుట్టును పొడిబార్చి, బలహీనంగా మారుస్తాయి. వేసవిలో ఇవి మరింత నష్టం కలిగిస్తాయి. సహజంగా జుట్టును ఆరబెట్టడం ఉత్తమం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper