mobile phone health : నేటి కాలంలో ఫోన్ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు. అయితే ఈ మొబైల్ కేవలం పని ప్రదేశాల్లో మాత్రమే కాకుండా రాత్రి నిద్రించేటప్పుడు పక్కనే ఉంచుకుంటున్నారు. కొందరైతే దీనిని దిండు కింద పెట్టుకొని మరీ పడుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఫోన్లో ఏర్పడే వేడి కారణంగా శరీరంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. మరి ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
మొబైల్ ను దిండు కింద ఉంచుకోవడం వల్ల సరైన గాలి ప్రసరణ లేకపోవడంతో ఇది మరింత వేడెక్కే అవకాశం ఉంటుంది. ఫోన్ వేడి బ్యాటరీ పై ప్రభావం పడుతుంది. దీంతో దీని పనితీరు తగ్గే అవకాశాలుంటాయి. కొన్ని సందర్భాల్లో అధిక వేడితో బ్యాటరీ దెబ్బతిని అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మరీ హీట్ ఎక్కితే పేలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఫోన్ కు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానే మొబైల్ కు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అలాగే కొందరు మొబైల్స్ ను వైబ్రేషన్ లో ఉంచుతారు. దిండు కింద ఉన్న మొబైల్ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నిద్రపంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. తరచూ నోటిఫికేషన్లు రావడంతో మెలకువ వచ్చే అవకాశాలు ఉంటాయి.
పదేపదే మొబైల్ ను చూడడం వల్ల త్వరగా అలసిపోతారు. దీంతో ఉదయం మరింత నీరసంగా ఉంటారు. అంతేకాకుండా ఆరోజు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఏ పని సక్రమంగా చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉండరు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ను దిండు కింద ఉంచరాదని నిపుణులు అంటున్నారు.
అయితే మొబైల్ తప్పనిసరిగా పక్కన ఉండాలని అనుకునేవారు కాస్త దూరంలో ఉంచుకోవాలి. అంతేకాకుండా రాత్రి సమయంలో నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవాలి. వైబ్రేషన్ కాకుండా మృదువైన సంగీతంతో రింగ్టోన్ ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర కాల్స్ లేకపోతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుకోవడం మంచిది. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు నిద్రపోయే గంట ముందే ఫోన్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఫోన్ తో పాటు మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.