Indian Youth : ఒకప్పుడు సరదా కోసం.. కిక్కు కోసం.. ఒత్తిడి నుంచి దూరం కావడం కోసం మద్యం ను తప్పనిసరిగా తీసుకునేవారు. ప్రతిరోజు రెండు పెగ్గులు వేస్తే గాని నిద్ర పట్టని వారు కూడా ఉన్నారు. అలా చాలామంది యవ్వనంలో ప్రారంభించిన మద్యం అలవాటును దీర్ఘకాలికంగా కొనసాగించేవారు. కానీ ఆ తర్వాత అనేక రకాల సమస్యలు ఎదుర్కొనేవారు. అయితే ఇటీవల మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. మద్యం వల్ల సమస్యలు ఉంటాయని గుర్తించిన చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో భారత దేశంలో మద్యం వినియోగంపై షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం పెరిగిపోతుంది. కానీ భారత్ లో మాత్రం ఇందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాజాగా యూరో మానిటర్ ఫర్ ఆల్ వరల్డ్ మార్కెట్ ఫర్ ఆల్కహాల్ డ్రింక్స్ 2025 నిర్వహించిన సర్వే ప్రకారం.. నేటి యువత మద్యం సేవించడం తగ్గిపోతుందని తెలుస్తోంది. పాత జనరేషన్ కి కొత్త జనరేషన్ కి మధ్య వినియోగం 36% తగ్గిపోయినట్లు తెలిసింది. ఈ సర్వే ప్రకారం మద్యం తాగే వయసు ఉన్నవారు ప్రతి ముగ్గురిలో ఒకరు పూర్తిగా మద్యానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. 2020లో వారానికి ఒకసారి అయినా మద్యం తాగాలని అనుకునే యువత 26% ఉండగా.. 2025 నాటికి ఇది 17 శాతానికి తగ్గిపోయింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.. కెరీర్ ప్లానింగ్.. మద్యం వల్ల వచ్చే సమస్యలను గుర్తించిన యువత దీనికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా ఆల్కహాల్ పై పెడుతున్న ఖర్చును అనవసరంగా భావించి దానిని దూరం చేసుకుంటున్నారు. 25% యువత నిద్రలేమి సమస్య ఎదుర్కోవడానికి ఆల్కహాల్ అని గుర్తించి.. దీనికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వే తెలిచింది.
అంతేకాకుండా ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవారు 53% మంది దానిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాగే నేటి యువత జీప్రాస్ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే స్నేహితులు కలిసినప్పుడు ఒకసారి మద్యం తాగుతూ.. మరోసారి నాన్ ఆల్కహాల్ తాగుతూ మద్యాన్ని తగ్గిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాన్ ఆల్కహాల్ డ్రింక్ వినియోగం పెరిగిపోతుండగా.. భారత్లో మాత్రం మద్యం తయారీ ఎక్కువ అవుతుంది. కానీ భారతీయ యువత మాత్రం మద్యానికి దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో యువత పూర్తిగా మద్యానికి దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.