spot_img
Homeలైఫ్ స్టైల్Satyanasi flowers: సత్యనాశితో పువ్వులతో అనారోగ్య సమస్యలన్నీ పరార్!

Satyanasi flowers: సత్యనాశితో పువ్వులతో అనారోగ్య సమస్యలన్నీ పరార్!

Satyanasi flowers: మన చుట్టూ ఎన్నో రకాలు మొక్కలు పెరుగుతుంటాయి. కాకపోతే వీటిని చూసి మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. మనం డైలీ చూస్తున్న కూడా అవి మనకి పనికి రాని మొక్కలుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో సత్యనాశి ఒకటి. చాలామంది ఈ మొక్క పనికి రాదని భావిస్తారు. కానీ ఈ మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఈ మొక్కను ఆయుర్వేదానికి కూడా ఉపయోగిస్తారట. ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క పువ్వుల పసుపు రంగులో ఉంటాయి.

 

చిన్న కాండంతో ఉన్న ఈ మొక్కల నుంచి పసుపు పాలలాంటి ద్రవం వస్తుంది. ఈ మొక్క పువ్వులు, కాండం, బెరడు, అన్నింటిని కూడా ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని అన్ని భాగాలను కూడా ఔషధానికి ఉపయోగిస్తారు. ఈ పువ్వు విత్తనాలు చూడటానికి ఊదా రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా బంజరు భూమిలో రోడ్డు పక్కన పెరుగుతాయి. వీటితో ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొవడంలో బాగా ఉపయోగపడతాయి. మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలు కనిపిస్తే అసలు వదలవద్దు. దీనివల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సత్యనాశి మొక్కలో యాంటీ మైక్రోబయల్, యాంటీ డయాబెటిక్, అనాల్జేసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే యాంటీ వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ మొక్కలతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. వీటితో పాటు దద్దుర్లు, మంట, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ మొక్కలను గుర్తు పట్టడం చాలా కష్టం. ఎందుకంటే కొందరు ఈ మొక్క ఎలా ఉందో తెలియదు.

 

ఈ మొక్కను 2000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో క్యాన్సర్, హెచ్‌ఐవీని నివారించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, టెర్పెనాయిడ్స్, ఫినోలిక్స్ వంటి సెకండరీ మెటాబోలైట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఇందులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిరోధించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని ఉపయోగించి అన్ని రకాల వ్యాధులను కూడా నిరోధించవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
Oktelugu Epaper