Hair Growth: అప్పట్లో ఒక యాడ్ వచ్చింది గుర్తుందా.. మీ బట్టతలపై జుట్టు మొలిపిస్తామని.. ఈ ఆయిల్ చేతులకు కూడా అంటవద్దని.. అలా అంటితే అరచేతులకు కూడా వెంట్రుకలు మొలుస్తాయని.. చెప్పేవారు గుర్తుందా.. ఆ ఆయిల్ ఎంతవరకు జుట్టు మొలిపించింది.. ఎంతవరకు సక్సెస్ అయిందనే.. విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు నిజంగానే బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రయత్నం విజయవంతమైంది. అలాగని దీనిని రాసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇంతకీ ఇది ఎక్కడ తయారైంది.. ఎవరు తయారు చేశారు.. ఎంతటి ధరలో అందుబాటులో ఉంటుంది.. ఈ అంశాల అన్నింటిపై ప్రత్యేక కథనం..
Also Read: రవితేజ, నవీన్ పోలిశెట్టి క్రేజీ మల్టీస్టార్రర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
మనిషి తన నిత్యజీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాడు. మనిషి జీవితం అనేది తను తీసుకునే ఆహారం ఆధారంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మనిషి శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అందులో వెంట్రుకలు ఊడిపోవడం ఒకటి. వెంట్రుకలు ఊడిపోవడాన్ని సహజమైన ప్రక్రియగా చాలామంది భావించరు. పైగా వెంట్రుకలు ఊడిపోతుంటే తీవ్రంగా బాధపడిపోతుంటారు. బ్రహ్మాండం బద్దలై పోతుంది అన్నట్టుగా ఇబ్బంది పడుతుంటారు. వెంట్రుకలు ఊడిపోవడం ఒకప్పుడు ఒక స్థాయి వయసు లో ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జుట్టు అనేది ఊడిపోతోంది. ఇటీవల కాలంలో ఈ సమస్య ఆడవాళ్ళల్లో కూడా మొదలైంది.
జుట్టు ఊడిపోవడాన్ని అంతర్జాతీయ సమస్యగా చాలామంది భావిస్తుంటారు కాబట్టి.. కార్పొరేట్ కంపెనీలు అడుగుపెట్టాయి. జుట్టు ఊడిపోవడానికి నియంత్రిస్తామని అనేక రకాల మందులను.. నూనెలను అందుబాటులో తీసుకొచ్చాయి. ఓ సర్వే ప్రకారం మనదేశంలో జుట్టు ఆధారంగా నడిచే పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఇవి ఏకంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చైనాలో ఒకసారి కొత్త శాస్త్రీయ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో ఆశలు చిగురిస్తున్నాయి.
చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ప్రకారం బట్టతలపై జుట్టు తిరిగి పెరగడం సాధ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనాలోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం కొద్దిరోజులుగా ఊడిపోయిన జుట్టును తిరిగి మొలిపించే చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో ఒక ప్రత్యేక సీరాన్ని రూపొందించింది. అయితే ఇది సాధారణ మార్కెట్ ఉత్పత్తి కాదు. ఇందులో సహజమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది తల భాగంలో నిద్రావస్థలో ఉన్న కారణాలను మేల్కొల్పుతుంది. జుట్టును పెరిగేలా చేసే ఫాలికిల్స్ లోని మూల కణాలను చైతన్యవంతం చేస్తుంది. వాస్తవానికి ఈ కణాలను చైతన్య స్థితికి తీసుకురావడం అనేది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అయితే ఈ తీరం వల్ల ఆ కణాలు పూర్వ స్థితికి వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని మొట్టమొదటిసారి శాస్త్రవేత్తలు ఎలుకల మీద చేశారు. ఎలుకల్లో జుట్టు రాలిపోయిన ప్రాంతాల్లో ఈ సీరాన్ని అప్లై చేశారు. కేవలం 20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల కనిపించింది. అయితే ఇది నార్మల్ కాస్మోటిక్ రిజల్ట్ కాదు. ఏకంగా సెల్ స్థాయిలోనే జరుగుతున్న మార్పు. చివరికి ఈ బృందంలోని ఒక శాస్త్రవేత్త తన శరీరంపై కాలుభాగంలో ఈ ప్రయోగాన్ని సాగించారు. అయితే అక్కడ కొత్త వెంట్రుకలు రావడం విశేషం. ఈ ప్రయోగం ఇంకా ప్రయోగశాల ను దాటి బయటికి రాలేదు. కాకపోతే చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ఆవిష్కరణ చాలామంది బట్టతల బాధితుల్లో ఆశలను నింపుతోంది.