spot_img
Homeహెల్త్‌ICU visiting rules and precautions: ICU లో ఉన్న వారిని చూసేందుకు వెళ్తున్నారా.. ఈ...

ICU visiting rules and precautions: ICU లో ఉన్న వారిని చూసేందుకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

ICU visiting rules and precautions: ఆస్పత్రి అంటే కేవలం వైద్యులను కలిసి.. మనకున్న వ్యాధిని చెప్పి.. చికిత్స తీసుకోవడం మాత్రమే కాదు.. ఆసుపత్రిలో చాలా విభాగాలు ఉంటాయి. అందులో ప్రముఖమైనది ఇన్సెంటివ్ కేర్ యూనిట్. దీనిని అత్యవసర వైద్య విభాగం అని పిలుస్తుంటారు. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ కంటే ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. దీనినిబట్టి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కు ఆస్పత్రి మేనేజ్మెంట్ ఇచ్చే ప్రయారిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..

ఒక వ్యక్తికి ఏదైనా ఆపద ఎదురైనప్పుడు.. వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తారు. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే incentive Care unit లో చేర్పిస్తారు. అక్కడ అతడికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తారు. దీనివల్ల ప్రాణాపాయం నుంచి అతనిని రక్షిస్తారు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో రకరకాల పరికరాలు ఉంటాయి.. అవన్నీ కూడా తక్కువ ఉష్ణోగ్రతలో పనిచేస్తూ ఉంటాయి. రోగులు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కాబట్టి.. ఆ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. అంటే నిత్యం అక్కడ ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి..

ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వారి ఆరోగ్యం అంత గొప్పగా ఉండదు. అలాంటి చోట వారు చికిత్స పొందుతున్నప్పుడు చూసేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వెళ్ళకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు.. ఎందుకంటే బయట నుంచి వచ్చే వారితో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందట. అయితే ఆస్పత్రి నిర్వాహకులు వద్దని చెప్పినప్పటికీ కూడా చాలామంది అలానే లోపలికి వస్తూ ఉంటారు.. ఇలా కాకుండా పేషంట్లకు దగ్గరగా ఉన్నవాళ్లు ఒకరు లేదా ఇద్దరు వచ్చి పక్కన ఉంటే సరిపోతుందని.. గుంపుగా వస్తే పేషెంట్లకు ఇబ్బంది మాత్రమే కాకుండా.. రకరకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

“ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో రోగులకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారో తెలుసుకోవలసిన బాధ్యత వారి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. ఇది కాదనలేని వాస్తవం. కాకపోతే చికిత్స పొందుతున్నప్పుడు సాధ్యమైనంతవరకు వైద్యులకు సహకరించాలి. రోగులను ఇబ్బంది పెట్టవద్దు. బయటి వాతావరణం లో అనేక రకాలైన సూక్ష్మ క్రిములు.. బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇన్సెంటివ్ కేర్ యూనిట్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇందులోకి బయటివారు వస్తే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్లు సోకడానికి ప్రమాదం ఉంటుంది. రోగులకు కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు బయటి వాళ్లు రాకపోవడమే మంచిదని” వైద్యులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper