Electricity Bill: కరెంట్ బిల్లుల మోత సామాన్యలకు పెద్ద ఇబ్బందికరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలం వచ్చిందంటే బిల్లు ఓ రేంజ్ లో వస్తోంది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషిన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కామన్ గానే కనిపిస్తున్నాయి. దాంతో ఈజీగానే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోంది. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలతోనే ఈ కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మన ఇంట్లో చేసే కొన్ని పొరపాట్లతోనే బిల్లు ఇంతలా వస్తుందంట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యాంపైర్ అప్లియన్సెస్ గురించి. అంటే చార్జర్లు, టీవీ, ల్యాప్ ట్యాప్ ప్లగ్గులు, ఇతర బ్యాటరీ ఛార్జర్లు లాంటివి పవర్ ప్లగ్గులకు అలాగే పెట్టి ఉంచుతాం. మనం ఆఫ్ చేశాం కదా అనుకుంటాం. కానీ ఆఫ్ చేసినా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
కాబట్టి ఈ వ్యాంపైర్ అప్లియన్సెస్‌ను మనం వాడుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్లగ్గులకు అలాగే పెట్టి ఉంచొద్దు. వాటిని తీసేయాలి. లేదంటే వీటి కారణంగానే మనకు తెలియకుండా ఎక్కువగా కరెంట్ బిల్లులు వస్తుంటాయి. ఇంకో విషయం ఏంటంటే వాషింగ్ మిషిన్, ఫ్రిడ్జ్ లాంటి హై కెపాసిటీ ఉన్న వాటిని వినియోగించడం. వాషింగ్ మిషిన్‌లో ఒకేసారి ఎక్కువ బట్టలు వేస్తే లోడ్ ఎక్కువయి కరెంట్ ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి బట్టలు తక్కువ తక్కువగా వేసి వాడుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ లాంటి వాటిని వినియోగించేటప్పుడు వాటి రేటింగ్‌ను చూసి తీసుకోవడం మంచిది.

ఇక ఇంట్లో వాడుకునే బల్బులు, ఫ్యాన్లు లాంటివి కూడా ఎక్కువగా కరెంట్‌ను తీసుకుంటాయి. అయితే వీటిని అవసరం లేనప్పుడు ఆఫ్ చేయాలి. ఇక తక్కువ వెలుతురు అవసరం ఉన్న చోట స్టడీ ల్యాంప్ వాటిని యూజ్ చేయాలి. ఇక కాలం చెల్లిన బల్బులను అస్సలు వాడొద్దు. అవి ఎక్కువ కరెంట్ ను తీసుకుంటాయి. ఇలా ఎప్పటికప్పుడు బల్బులను మార్చుకోవడం వల్ల తక్కువ కరెంట్ బిల్లులు వస్తాయి.
Also Read: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకిచ్చిన టీటీడీ..? ఈ గగ్గోలేంటి?
[…] Amazing Facts: ట్రైన్ జర్నీని అందరూ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే చాలా స్పీడుగా వెళ్తుంది, అలాగే బస్సులాగా ఎత్తేయడం లాంటివి ఉండదు. పైగా తింటూ కావాలంటే పడుకుంటూ కూడా ప్రయాణం చేయొచ్చు. కాగా ట్రైన్ జర్నీ చేసే వాళ్లు చాలామంది ఒక విషయాన్ని గమనించి ఉండదు. అదేంటంటే ట్రైన్ చివరి భోగీ మీద X అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసుకోరు. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉంది. […]
[…] Pigeon Message: ఇప్పుడంటే ఒక చోట నుంచి మరొక చోటకు సమాచారం ఇవ్వడం అంటే క్షణాల్లో పని. సెల్ ఫోన్. లేదంటే మెయిల్ లేదంటే ఉత్తరాల లాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం మాత్రం పావురాల ద్వారా సమాచారాన్ని చేరవేసేవారు. అయితే ఈ పావురాలు సరిగ్గా గమ్య స్థలాన్ని ఎలా గుర్తిస్తాయన్నది ఇప్పటికీ పెద్ద డౌటే. అయితే ఇవి ఎలా గుర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. […]