Newly Married Couple: భార్యాభర్తల మధ్య బంధం పదికాలాలపాటు కొనసాగాలంటే తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత ఉండాలి అలాగే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రతి చిన్న చిన్న విషయాలకే తీవ్రస్థాయిలో గొడవలు పడిన వారి బంధాన్ని మొదట్లోనే తుంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరుఅధికారం చలాయిస్తూ పెళ్లి అయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఇక భార్యాభర్తల మధ్య అనుబంధం అన్యోన్యంగా సాగిపోవాలంటే కొత్తగా పెళ్లైన జంట ఈ విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే…

ఒకరిపై మరొకరికి నమ్మకం: ఇద్దరి మధ్య బంధం కొనసాగాలంటే నమ్మకం ఎంతో ముఖ్యం నమ్మకం లేని చోట ఎలాంటి బంధం నిలబడదు కనుక భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం ఉన్నప్పుడే ఆ బంధం పదికాలాలపాటు కొనసాగుతుంది.
సమాన హక్కు: భార్యాభర్తల మధ్య బంధంలో పెత్తనం చెలాయించడం ఉండకూడదు. నేను భర్త అని నా భార్య పై ఎలాంటి హక్కులైనా నాకు ఉంటాయి అని అపోహలో భర్త ఉండకూడదు.ఇద్దరు కూడా సమాన హక్కులను కలిగి ఉండాలి అలాగే ఒకరిపై ఒకరు చులకన చేసి మాట్లాడకూడదు ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించడం వల్ల ఆ బంధం బలహీన పడుతుంది.
Also Read: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?
కోరికలకు గౌరవం ఇవ్వాలి: భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలంటే ఒకరి కోరికలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. ఈ క్రమంలోనే వారికి ఇష్టమైన బహుమతులు ఇస్తూ వారిని సంతోష పెట్టడంతోనే మన బంధం బలపడుతుంది. ఇలా ఒకరి కోరికలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం పదికాలాలపాటు కొనసాగుతుంది.
వృత్తి పట్ల గౌరవం: ప్రస్తుత కాలంలో ఇద్దరు ఏదో ఒక పని చేస్తేనే జీవితం నడుస్తుంది. కనుక ఇలాంటి పనులు చేసిన వారు చేస్తున్న పనికి గౌరవం ఇవ్వాలి. తక్కువ వేతనం వస్తుందని ఎప్పుడు హేళన చేయకూడదు.ఇలా వృత్తిపట్ల ఒకరిపై మరొకరికి గౌరవం ఉన్నప్పుడు బంధం బలపడుతుంది.
Also Read: హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ తరలిపోకుండా తెలంగాణ సర్కార్ ‘భీమ్లానాయక్’ ను వాడుకుందా?