6-6-6 Walking Benefits: 30 ఏళ్లు దాటిన వ్యక్తి ప్రతిరోజు చేసే పని డబ్బు కోసమే. అయితే డబ్బు మాయలో పడి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం డబ్బు ఉంటే మిగతావన్నీ ఈజీనే అని అనుకుంటున్నాడు. కానీ డబ్బు కంటే విలువైంది ఎంతో ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటేనే డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దినచర్యలో భాగంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత సమయం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ఒక క్రమ పద్ధతిలో వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. కొంతమంది ఉదయం వాకింగ్ చేస్తారు. కానీ ఎంతసేపు వాకింగ్ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అనేది వారికి తెలియదు. అయితే కొంతమంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం 6-6-6-ఫార్ములా పాటిస్తే గుండె సమస్యలను దూరం చేయవచ్చు అని అంటున్నారు. అసలు ఈ త్రిబుల్ సెక్స్ ఫార్ములా ఏంటి?
Also Read: 18 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్యలు.. ఎందుకో తెలుసా?
ఏదైనా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళిక చాలా అవసరం. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొన్ని సూత్రాలను పాటించాలని అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వాకింగ్ చేయాలని అనుకునేవారు 6-6-6-ఫార్ములా పాటించాలని అంటున్నారు. ఇందులో మొదటి 6.. ఉదయం 6 గంటలకు లేవడం. చాలామంది నేటి కాలంలో పొద్దుపోయిన తర్వాత నిద్రలేస్తున్నారు. ఇలా కాకుండా ఉదయం ఆరు గంటలకి లేవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని అంటున్నారు రెండో 6 నిమిషాల పాటు వామప్ చేయడం.. అంటే వాకింగ్ చేసేముందు కాస్త వామప్ చేయడం వల్ల కండరాలు పట్టుకోవడం వంటి సమస్యలు ఉండవు. ఇక మూడో 6.. 60 నిమిషాల పాటు నడవాలి.
అంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు కచ్చితంగా ఒక గంట పాటు నడవడం వల్ల గుండె సమస్యలు దూరమయ్యే అవకాశం ఉందని కొందరు ప్రముఖ వైద్యులు తెలుపుతున్నారు. అంటే ప్రతి రోజూ ఉదయం 60 నిమిషాలు సాధ్యం కాని వారు.. ఉదయం 30 నిమిషాలు.. సాయంత్రం 30 నిమిషాల పాటు కూడా నడిచే విధంగా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. మొత్తంగా ప్రతిరోజు 60 నిమిషాల పాటు నడిస్తేనే గుండె సమస్యల నుంచి దూరం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: రాత్రిళ్ళు పదే పదే మూత్రం వస్తుందా?
అయితే ఈ 60 నిమిషాల పాటు సాధారణంగా కాకుండా గుండె నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకునే విధంగా వాకింగ్ చేయాలని అంటున్నారు. అలా చేయడంవల్ల హార్ట్ బీట్ స్టేజ్ పెరుగుతుందని తెలుపుతున్నారు. అయితే మనం నడిచే సమయంలో హార్ట్ బీట్ ఎలా ఉంది? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొందరు వైద్యులు ఇలా చెప్పారు. వారానికి కనీసం 220 నిమిషాల పాటు నడవాలని చెబుతున్నారు. అంటే 220 మైనస్ మీ యొక్క వయసు తీసేస్తే.. వచ్చేదే హార్ట్ బీట్ అని తెలుసుకోవాలి. ఉదాహరణకు 220 -40=180.. అంటే మీ హృదయ స్పందన 180 ఉందని తెలుసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం లో నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్నారు.