Early morning health symptoms: వాతావరణ కాలుష్యం, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ చూడగానే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొందరు చెబుతున్న ప్రకారం ఉదయం లేవగానే కొందరికి శరీరం వనికినట్లుగాను.. కాళ్లలో బలహీనత ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని.. దీర్ఘకాలంలో ఇవి పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయని అంటున్నారు. అసలు ఈ లక్షణాలు రావడానికి కారణం ఏంటి? ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ఏదో ఒక పనితో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటున్నారు. దీంతో ఆహారంపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొందరు తాము నిర్వహించే విధుల వల్ల రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉంటున్నారు. ఇలా తీసుకోకపోవడం వల్ల ఉదయం లేవగానే శరీరంలో వణుకు పుడుతుంది. బలహీనతగా ఉన్నట్లు అనిపించి చెపుటకు వస్తుంటాయి. ఆ తర్వాత తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరు రాత్రి నిద్ర పోయిన తర్వాత దాహం వేసినా కూడా నీరు తీసుకోకుండా ఉంటారు. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇలా నీరు తీసుకోకపోవడం వల్ల వేడి వాతావరణం లో శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి. ఫలితంగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి కండరాలు వణుకుతూ ఉంటాయి.
ఉద్యోగం, వ్యాపారం చేసేవారు విధుల్లో భాగంగా కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ప్రత్యేకంగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇవి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. తాత్కాలికంగా ఇవి ఉత్తేజపరిచినా కూడా.. ఆ తర్వాత చేతుల్లో వణుకు, గుండెలో వేగం పెరగడం, ఆందోళన వంటివి కనిపిస్తాయి. అనుకోకుండా లేదా కొన్ని కారణాలవల్ల తీవ్రమైన ఒత్తిడి ఉండడంవల్ల కార్డి సోల్ అధికంగా విడుదలవుతుంది. ఇది కండరాలపై తీవ్ర ప్రభావం చూపి వణుకు పుట్టిస్తుంది. నిద్రలేమి కారణంగా లేదా థైరాయిడ్ ఎక్కువగా అవడం వల్ల, విటమిన్ బి12 లోపం వల్ల, పార్కిన్సన్ ప్రారంభం లో ఉండడంవల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
అయితే ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతిరోజు ఇవి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతకుముందు నిద్రపోయే సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. శరీరానికి సరిపడా నీరు తాగాలి. కాఫీ లేదా టీ పరిమితంగా తీసుకోవడం మంచిది. ఉదయం లేవగానే తేలికపాటి పానీయం తీసుకోవాలి. ఒకవేళ ఉదయం లేవగానే వణుకు కనిపిస్తే వెంటనే పండ్ల రసం తీసుకోవాలి. కొన్ని నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. అయినా కూడా ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.