Homeఎంటర్టైన్మెంట్Aamir Khan: అమీర్ ఖాన్ ముంబై నుంచి చెన్నై కి మకాం మార్చడానికి కారణం ఏంటి?

Aamir Khan: అమీర్ ఖాన్ ముంబై నుంచి చెన్నై కి మకాం మార్చడానికి కారణం ఏంటి?

అమీర్ ఖాన్ చెన్నై రావడానికి ఓ పెద్ద కారణమే ఉందంట. కానీ తన కోసం కాకుండా తల్లి కోసం చెన్నైకి మకాం మారుస్తున్నారట. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అమీర్ ఖాన్ తల్లి చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందని టాక్.

Aamir Khan: అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోయారు ఈ హీరో. మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న అమీర్ ఖాన్ ముంబైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాదు అక్కడ ఈయనకు ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయి. ఈయన ముంబైని విడిచి చెన్నైకి మకాం మార్చాలి అనుకుంటున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది. అయినా అందరూ ముంబై వెళ్ళాలి అనుకుంటే ఈయన మాత్రం చెన్నై వెళ్తున్నారు. మరి దీని వెనుక కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది చదివేసేయండి.

అమీర్ ఖాన్ చెన్నై రావడానికి ఓ పెద్ద కారణమే ఉందంట. కానీ తన కోసం కాకుండా తల్లి కోసం చెన్నైకి మకాం మారుస్తున్నారట. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అమీర్ ఖాన్ తల్లి చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందని టాక్. చికిత్సకు నిత్యం అందుబాటులో ఉండేలా చెన్నైకి మకాం మార్చాలి అనుకున్నారట ఈ స్టార్ హీరో. దీనికోసం ఓ హోటల్ ను కూడా బుక్ చేసుకున్నారట. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ప్రస్తుతం ఏ ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. తల్లికి తన తోడు అవసరం అని భావిస్తున్న అమీర్ ఖాన్.. పూర్తి సమయం తల్లి కోసమే కెటాయించాలి అనుకుంటున్నారట.

ఈ మధ్య అమీర్ ఖాన్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవాలని కూడా భావించారట అమీర్ ఖాన్. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని వారికి విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ఒంటరిగా ఉంటున్నారు. కానీ తన తల్లి కోసం చెన్నై వెళ్లడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఎన్ని రోజులు చెన్నైలో ఉంటారనే విషయంపై క్లారిటీ లేదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper