Naga Chaitanya Nagarjuna movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో తెలుగు సినిమా స్టాండర్డ్ ఏంటో దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమా స్టామినా ఏంటో రాజమౌళి రుచి చూపించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మన నుంచి వస్తున్న సినిమాలు కొత్తదనాన్ని రేకెత్తించే విధంగా ఉండాలి కానీ మూస ఫార్మాట్లో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే మన దర్శక నిర్మాతలందరు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ హీరోలు సైతం ప్రయోగత్మకమైన సినిమాలను చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి మరోసారి నాగార్జున డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు.
అలాగే తన కొడుకు అయిన నాగచైతన్య సైతం వృషకర్మ అంటూ కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక అడ్వెంచర్ జానర్ లో సినిమాని చేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరు ఎవరి సినిమాల్లో వారు నిమగ్నమైనప్పటికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుంటే నాగార్జున విలన్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతటిగా విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా నాగార్జున ఎలాంటి స్టాండర్డ్ ఉన్న హీరోనో మనందరికి తెలుసు… ఇప్పటికే ఆయన కూలీ సినిమాలో విలన్ గా నటించి తన మార్క్ ఏంటో చూపించాడు. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన ‘కుబేర’ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.
తన కొడుకు అయిన నాగచైతన్య సినిమాలో ఎలాంటి విలనిజాన్ని పండిస్తాడు.ఈ క్యారెక్టర్ ను దర్శకుడు ఎలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…