Homeక్రీడలుT20 World Cup double super over: టీ20 వరల్డ్ కప్ లోనే సంచలనం.. డబుల్...

T20 World Cup double super over: టీ20 వరల్డ్ కప్ లోనే సంచలనం.. డబుల్ సూపర్ ఓవర్.. గెలుపు ఎవరిదంటే?

T20 World Cup double super over: టీ20 వరల్డ్ కప్ లో సంచలనం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ విజయం కోసం చివరి వరకు పోరాటం సాగించాయి. ఈ పోరాటంలో క్షణక్షణం ఉత్కంఠ చోటుచేసుకుంది. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజా లభించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ 61, డికాక్ […]

T20 World Cup double super over: టీ20 వరల్డ్ కప్ లో సంచలనం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ విజయం కోసం చివరి వరకు పోరాటం సాగించాయి. ఈ పోరాటంలో క్షణక్షణం ఉత్కంఠ చోటుచేసుకుంది. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజా లభించింది.

ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ 61, డికాక్ 59 పరుగులు చేశారు. ఓమర్ జాయ్ మూడు, రషీద్ ఖాన్ 2 వికెట్లు సాధించారు. అనంతరం టార్గెట్ చేజింగ్ మొదలుపెట్టిన ఆఫ్గానిస్తాన్ జట్టు 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గుర్బాజ్ 84 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచి ఉండాల్సిందే. చివర్లో ఫారుకి అనుకోకుండా రన్ అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్కోర్ సమం సమం అయింది.

రెండు జట్ల స్కోర్లు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు మ్యాచ్ దారి తీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17 రన్స్ చేసింది. ఎంగిడి వేసిన ఆ ఓవర్లో అజ్మత్ తొలి బంతికి ఫోర్.. రెండవ బంతికి సిక్స్.. మూడో బంతికి సింగిల్ రన్ తీసాడు. నాలుగో బంతికి గుర్బాజ్ సింగిల్ రన్ తీసాడు. ఆ తర్వాత అజ్మత్ ఐదవ బంతికి ఫోర్ కొట్టాడు. చివరి బంతికి సింగిల్ తీశాడు. మొత్తంగా సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు ఫారుకి వేసిన తొలి బంతికి మిల్లర్ సింగిల్ రన్ తీసాడు. ఆ తర్వాత బ్రేవిస్ స్ట్రైక్ తీసుకున్నాడు. రెండవ బంతికి సిక్సర్ కొట్టాడు. మూడో బంతికి బ్రేవిస్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి స్టబ్స్ ఫోర్ కొట్టాడు. ఐదవ బంతి డాట్ అయింది. అయితే ఆరో బంతికి స్టబ్స్ సిక్సర్ కొట్టడంతో రెండు జట్ల స్కోర్లు సమానం అయ్యాయి.

రెండు జట్ల స్కోర్లు ఈక్వల్ కావడంతో మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. రెండవ సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అజ్మత్ వేసిన తొలి బంతికి స్టబ్స్ సిక్సర్ కొట్టాడు. రెండవ బంతికి సింగిల్ రన్ తీసాడు. మూడో బంతికి మిల్లర్ రెండు పరుగులు తీశాడు. నాలుగో బంతికి మిల్లర్ సిక్సర్ కొట్టాడు. ఐదవ బంతికి కూడా సిక్సర్ కొట్టాడు. ఆరో బంతికి రెండు పరుగులు తీశాడు. మొత్తంగా ఈ ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 23 పరుగులు తీసింది.

ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ వేసింది. మహారాజ్ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి నబి పరుగు తీయలేదు. రెండవ బంతికి నబి క్యాచ్ అవుట్ అయ్యాడు . మూడవ బంతికి గుర్బాజ్ సిక్సర్ కొట్టాడు. నాలుగో బంతికి కూడా గుర్బాజ్ సిక్సర్ కొట్టాడు. ఐదో బంతిని కూడా సిక్సర్ గా మలిచాడు. ఆరో బంతిని కేశవ్ మహారాజ్ వైడ్ గా వేశాడు. మరుసటి బంతికి గుర్బాజ్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా జట్టు ఉత్కంఠ మధ్య నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper