spot_img
Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Eagle: రవితేజ ఈగల్ సినిమా కి, ఇడియట్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి..?

Ravi Teja Eagle: రవితేజ ఈగల్ సినిమా కి, ఇడియట్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి..?

Ravi Teja Eagle: ఫిబ్రవరి 9వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న రవితేజ ఈగల్ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని కూడా ఒక మంచి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇంతకు ముందు ఈయన డైరెక్ట్ చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ఈ సినిమాతో తనని తను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ప్రస్తుతం రవితేజ ఈ సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రవితేజ గత రెండు చిత్రాలు అయిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడం తో రవితేజ మార్కెట్ కొంతవరకు డౌన్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద యూనిట్ మొత్తం మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఎలాగైనా ఈసారి సక్సెస్ కొడుతున్నామంటూ చాలా ఉత్సాహంతో కనిపించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే నెలకొన్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులు కూడా ఈ సినిమాతో రవితేజ ఒక భారీ హిట్ కొట్టబోతున్నాడు అంటు ఆనందం తో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది.

అయితే ఈ రెండింటి మధ్యనున్న లింక్ ఏంటి అంటే స్క్రిప్ట్ పరంగా కొన్ని సీన్లని ఇడియట్ సినిమాలో నుంచి స్పూఫ్ లుగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సీన్లు ఇప్పుడు రిపీట్ చేస్తే సినిమాలో కామెడీ అనేది వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందే రవితేజ ధమాకా సినిమాలో ఇంద్ర సినిమాలోని ఒక ఎమోషనల్ సీన్ ని కామెడీ సీన్ గా వాడుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే సీన్ ను రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…మరి ఆ సీన్లు వర్కౌట్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper