Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు వింటే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అని చెబుతుంటారు. ఈయనకు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ఈయన తెరకెక్కించే సినిమాలు కూడా అదే రేంజ్ లో హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఈయన సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఎలా ఇవ్వాలో కూడా బాగా తెలిసిన దర్శకుడు. ఇలాంటి కామెంట్లు, కౌంటర్ల వల్ల బలుపు అని పిలిపించుకుంటున్నారు సందీప్. ఈయనను అభిమానించే వారు మాత్రం.. ఆయన తెరకెక్కించే సినిమాలను చూస్తే ఆ మాత్రం బలుపు ఉండడంలో తప్పేం లేదు అంటారు.
ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రెటీలు యానిమల్ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు. రాధికా, కస్తూరి, తాప్సీ ఇలా ఒక్కొక్కరుగా యానిమల్ సినిమా దారుణంగా ఉందని విమర్శించారు. ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా చేరింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. బాహుబలి, కబీర్ సింగ్, యానిమల్ స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇలా కామెంట్లు చేసిన తర్వాత సందీప్ రెడ్డి ఊరుకుంటారా? తనదైన రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇక యానిమల్ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రోల్స్ ఆగలేదు. అయితే సందీప్ వంగా కిరణ్ రావు పేరు తీయకుండానే.. ఆమెకు కౌంటర్లు ఇచ్చారు. ఇది విన్న అభిమానులు ఇది కదా మా సందీప్ అంటే అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె అన్న వ్యాఖ్యలు నేను విన్నాను.. ఆమెకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ ను వెళ్లి అడగమనండి.. ఆయన నటించిన దిల్ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా చేస్తాడు. అది కూడా తప్పు చేసిందని నమ్మిస్తాడు.
చివరకు ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఉంది. ఇక ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొందరు ఈ డైరెక్టర్ ను ప్రశ్నిస్తే.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఆగేది ఎప్పుడో చూడాలి.