Homeఎంటర్టైన్మెంట్Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ చేసే సినిమా ఏంటో...

Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ చేసే సినిమా ఏంటో తెలుసా..?

ఇక రామ్ మార్కెట్ కూడా పాన్ ఇండియా స్థాయిలో విస్తరిస్తుంది. కాబట్టి హరీష్ శంకర్ రామ్ తో సినిమా చేస్తే ఆ మార్కెట్ కూడా ఆయనకి చాలా బాగా వర్కవుట్ అవుతుంది.

Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒకప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్..ప్రస్తుతం ఈయన రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దీనికంటే ముందే పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” లాంటి సినిమాను స్టార్ట్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల మధ్యలో ఆపేసి మిస్టర్ బచ్చన్ సినిమాని స్టార్ట్ చేసి దాన్ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేసి దాన్ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి హరీష్ శంకర్ రాసే కమర్షియల్ స్టోరీస్ కి, కమర్షియల్ డైలాగ్ లకి రామ్ సరిగ్గా సరిపోతాడు ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ హరీష్ శంకర్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్టు అనేది పట్టాలెక్కలేదు.

మరి ఇలాంటి క్రమంలో హరీష్ శంకర్ రామ్ తో ఒక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ సినిమా సూపర్ సక్సెస్ అయితే హరీష్ శంకర్ రామ్ తో ఈ సినిమా చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

ఇక రామ్ మార్కెట్ కూడా పాన్ ఇండియా స్థాయిలో విస్తరిస్తుంది. కాబట్టి హరీష్ శంకర్ రామ్ తో సినిమా చేస్తే ఆ మార్కెట్ కూడా ఆయనకి చాలా బాగా వర్కవుట్ అవుతుంది. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా ఒకవేళ వచ్చినా ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం రామ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper